ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money: చక్కగా మంచి జాబ్ వెతుక్కోక ఇదేం పనయ్యా బాబూ.. ఓ కుర్రాడు చేసిన ఒక్క మిస్టేక్‌తో రూ.25 లక్షలు మటాష్..!

ABN, First Publish Date - 2023-06-21T21:42:01+05:30

డబ్బు మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుందనడానికి నిదర్శనంగా నిత్యం మన ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు నేరస్థులు.. అమాయకులు మొదలుకుని అన్నీ తెలిసిన వారిని కూడా చాలా తెలివిగా బుట్టలో పడేస్తుంటారు. కొందరు నిందితులు ముందుగా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బు మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుందనడానికి నిదర్శనంగా నిత్యం మన ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు నేరస్థులు.. అమాయకులు మొదలుకుని అన్నీ తెలిసిన వారిని కూడా చాలా తెలివిగా బుట్టలో పడేస్తుంటారు. కొందరు నిందితులు ముందుగా డబ్బు ఎర చూపి.. చివరకు బ్యాంకు ఖాతాలను మొత్తం ఖాళీ చేసేస్తుంటారు. తాజాగా, గురుగ్రామ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కుర్రాడు చేసిన ఒక్క మిస్టేక్‌తో రూ.25లక్షలు మటాష్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

గురుగ్రామ్‌లో (Gurugram) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెక్టార్- 57 సొసైటీలో నివాసం ఉంటున్న సుబ్రతా ఘోష్ అనే వ్యక్తి.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. బాధితుడికి మార్చిలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ వాట్సప్ మెసేజ్ (WhatsApp message) వచ్చింది. వివిధ రకాల వెబ్‌సైట్‌లకు ఫైవ్ స్టార్ రేటింగ్ (Five star rating) ఇవ్వడం ద్వారా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని, ఇందుకోసం టెలీగ్రామ్ గ్రూపులో జాయిన్ కావాలని సూచించారు. దీంతో బాధితుడు ఆశపడి వారు చెప్పినట్లే చేశారు.

Crime: కేజీఎఫ్ సినిమా సీన్.. రియల్ లైఫ్‌లో రిపీట్.. ఓ కార్మికుడు తప్పించుకుని వెళ్లి పోలీసులకు చెప్పడంతో వెలుగులోకి విస్తుపోయే దారుణం..!

తర్వాత టెలీగ్రామ్ గ్రూపులో (Telegram group) కొన్ని లింక్స్ వేసి, వాటికి రేటింగ్ ఇవ్వాలని సూచించారు. తర్వాత అతడి నుంచి రూ.10,000లు పెట్టుబడిగా తీసుకున్నారు. రేటింగ్ ఇచ్చిన తర్వాత అతడికి తిరిగి రూ.18,000 పంపించారు. దీంతో బాధితుడికి వారిపై నమ్మకం కలిగింది. క్రమంగా పెట్టుబడి పెంచుతూ వచ్చారు. అయితే బాధితుడు సుబ్రతా ఘోష్‌కు మధ్యలో అనుమానం వచ్చింది. దీంతో ఇచ్చిన పని పూర్తి చేయకపోతే ఖాతా స్తంభించిపోతుందని హెచ్చరించడంతో వారు చెప్పినట్లే చేశాడు. ఇలా బాధితుడి నుంచి విడతల వారీగా రూ.25.29లక్షల వరకు (Money transfer) బదిలీ చేయించుకున్నారు.

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం ఖాయం.. మామిడి కాయల్ని ఇతడు అమ్ముతున్న టెక్నిక్‌ను చూస్తే..!

ఆ తర్వాత కూడా మరింత నగదు డిపాటిజ్ చేయాలని బలవంతం చేశారు. అలా చేయకపోతే బ్యాంకు ఖాతాలన్నీ హ్యాక్ (Hack) చేస్తామని బెదిరించారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న సుబ్రతా ఘోష్.. సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి చేతిలో ఇలా చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Viral Video: ఇలాంటి డ్రెస్‌తో డాన్స్ ఎలా సాధ్యమంటూ వధువును అభినందించిన వరుడు.. విషయం తెలుసుకుని అవాక్కయిన అతిథులు..

Updated Date - 2023-06-21T21:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising