Viral Video: విమానాల్లోంచి కిందకు దూకేసిన 105 మంది వృద్ధులు.. పక్కా ప్లాన్‌తో అంతా 5 విమానాల్లో వెళ్లి మరీ..!
ABN, First Publish Date - 2023-04-21T19:00:46+05:30
వారంతా 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులు. సాధారణంగా ఎవరైనా ఈ వయసులో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంటారు. కాటికి కాళ్లు చాపా ఈ వయసులో వీరు వినూత్న విన్యాసం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా..
వారంతా 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులు. సాధారణంగా ఎవరైనా ఈ వయసులో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంటారు. కాటికి కాళ్లు చాపా ఈ వయసులో వీరు వినూత్న విన్యాసం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా 5విమానాల్లో ఆకాశ వీధిలోకి వెళ్లారు. అంతా కలిసి పక్కా ప్లాన్‌తో ఒక్కసారిగా కిందకు దూకేశారు. భూమి పైకి దూసుకొస్తూ వీరు చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో (America California) ఈ ఘటన చోటు చేసుకుంది. 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వృద్ధులంతా (60 to 80 years old people) కలిసి ఆకాశంలో వినూత్న విన్యాసం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అంతా కలిసి 5 వేర్వేరు విమానాల్లో గగన తలానికి వెళ్లారు. వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక అన్ని విమానాల నుంచి ఒక్కొక్కరుగా కిందకు దూకేశారు. సుమారు 194 కిలోమీటర్ల వేగంతో కిందకు దూసుకొస్తుండగా మధ్యలో అద్భుత విన్యాసం చేశారు. అన్ని విమానాల నుంచి దూకిన వారంతా ఒక్కొక్కరుగా చేతులు పట్టుకుని చివరకు ఓ అందమైన వలయంలా మారారు.
Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!
అంత వయసున్నా, అంత వేగంలో భూమి మీదకు దూసుకొస్తున్నా.. ఎక్కడా తడబడకుండా అనుకున్న విధంగానే పెద్ద వయలాన్ని సృష్టించారు. భూమి సమీపంలోకి వస్తామనగా.. అంతా ప్యారాచ్యూట్ ఓపెన్ చేసుకుని క్షేమంగా కిందకు దిగేశారు. చివరగా అంతా విజయకేతనం చూపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. వృద్ధుల విన్యాసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘‘మంచానికి పరిమితమయ్యే వయసులో స్కైడైవింగ్ (Skydiving) చేయడం నిజంగా గ్రేట్’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-04-21T19:00:46+05:30 IST