ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anand Mahindra: 'అతడి ధైర్యం, సంకల్పం అన్‌స్టాపబుల్.. కచ్చితంగా ఆదుకుంటా'

ABN, First Publish Date - 2023-10-14T12:22:42+05:30

సోషల్ మీడియా (Social Media) లో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Anand Mahindra Tweet: సోషల్ మీడియా (Social Media) లో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన వాటిని ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంటారు. వాటిల్లో కొన్ని మానవ సంబంధాలను తెలియజేసేవి, మరికొన్ని సృజనాత్మకతను బయటపెట్టేవి, ఇంకొన్ని విజ్ఞానం పంచేవి ఉంటాయి. ఇదే కోవలో తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పడది తెగ వైరల్ అవుతోంది. దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసే క్రీడాకారులకు బహుమతులు అందజేస్తూ వారిని మరింతగా ప్రోత్సహించడం ఆయన నైజం. ఇప్పటికే వివిధ క్రీడలకు చెందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి ఈ విషయాన్ని నిరూపించారు కూడా ఆయన. ఇప్పుడు ఇటీవల చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో సత్తా చాటిన ఓ దినసరి కూలీ (Daily wage worker) విషయమై ఆనంద్ర్ మహీంద్రా ఒక ట్వీట్ (Tweet) చేశారు. ఆ క్రీడకారుడి కాంటాక్ట్ వివరాలు ఇస్తే.. అతణ్ని ఆదుకుంటాననేది ఆ ట్వీట్ సారాంశం.

ఇటీవల చైనాలో ముగిసిన ఏషియన్ గేమ్స్‌ 2022 (Asian Games 2022) లో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దినసరి కూలీ అయిన రాంబాబు (Rambabu) 35 కిలోమీటర్ల నడకలో కాంస్యం గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇలా ఓ దినసరి కూలీ ఆసియా క్రీడల్లో రాణించడం, ఆపై మెడల్‌ కూడా సాధించడం ఆనంద్ మహీంద్రను ఎంతోగాను ఆకట్టుకుంది. అతని గురించి తెలుసుకున్న ఆయన వెంటనే ఒక ట్వీట్ చేశారు. ఎవరైనా తనకు రాంబాబు కాంటాక్ట్ వివరాలు చెబితే అతని కుటుంబానికి ఏదైనా సాయం చేసి ఆదుకుంటానని చెప్పుకొచ్చారు. "దినసరి కూలీ నుంచి ఆసియా క్రీడల పతక విజేత. ఇతడి ధైర్యం, సంకల్పం అన్‌స్టాపబుల్. దయచేసి అతని కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. ఆ కుటుంబానికి కావలసిన ఏదైనా ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కు అందించి ఆదుకోవాలనుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఆనంద్ మహీంద్రా మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కు 3.28లక్ష వ్యూస్, 8వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-14T12:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising