Crime News: పార్క్‌లో ఉన్న బాలుడిని బలవంతంగా కారులో తీసుకెళ్లిన స్నేహితులు.. రూ.200 కోసం చివరకు..
ABN, Publish Date - Dec 21 , 2023 | 06:18 PM
రోజురోజుకూ చాలా మందిలో నేర స్వభావం పెరిగిపోతోంది. చివరకు స్కూలు వెళ్లే విద్యార్థులు కూడా అనేక రకాల నేరాలకు పాల్పడి.. విలువైన జీవతాన్ని జైలుపాలు చేసుకుంటున్నారు. కొందరు విద్యార్థులైతే తోటి స్నేహితులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా...
రోజురోజుకూ చాలా మందిలో నేర స్వభావం పెరిగిపోతోంది. చివరకు స్కూలు వెళ్లే విద్యార్థులు కూడా అనేక రకాల నేరాలకు పాల్పడి.. విలువైన జీవతాన్ని జైలుపాలు చేసుకుంటున్నారు. కొందరు విద్యార్థులైతే తోటి స్నేహితులు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా దాడులకు పాల్పడడం కూడా చూస్తూ ఉన్నాం. తాజాగా, ఇలాంటి ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పార్క్‌లో ఉన్న బాలుడిని స్నేహితులంతా కలిసి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రూ.200 కోసం చివరకు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలుడు.. తన స్నేహితులకు రూ.200లు బాకీ ఉన్నాడు. ఈ విషయంలో తరచూ వీరి మధ్య గొడవలు (Quarrel between friends) జరుగుతుండేవి. నెల రోజుల క్రితం కూడా అప్పు విషయమై వారి మధ్య గొడవ జరిగింది. అయితే ఇంతవరకూ బాకీ ఇవ్వకపోవడంతో స్నేహతులు అతడిపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు సదరు బాలుడు పార్కులో తన స్నేహితుడితో కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా.. అప్పు ఇచ్చిన బాలుడు తన సహ విద్యార్థులతో కలిసి కారులో అక్కడికి వెళ్లాడు. బాకీ ఉన్న బాలుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశాలనికి తీసుకెళ్లారు.
Viral Video: జలపాతం వద్ద స్నానాలు చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన.. చివరికి ఏమైందో చూడండి..
అక్కడ వారంతా కలిసి అతడిపై విచక్షణా రహితంగా (friends attacked the boy) దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి దుస్తులు విప్పించి.. కర్రలు, బెల్టులతో దాడికి పాల్పడ్డారు. ‘‘డబ్బులు ఇచ్చేస్తాను.. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్’’.. అంటూ దండం పెట్టి వేడుకుంటున్నా వారు కనికరించలేదు. దాడికి ముందు వారు మద్యం సేవిచండమే కాకుండా బాధిత బాలుడితో కూడా బలవంతంగా తాగించే ప్రయత్నం చేశారు. దాడి చేసిన విషయాన్ని పోలీసులకు చెబితే.. చంపేస్తామంటూ హెచ్చరించారు. కాగా, కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో, ఫొటోలు వైరల్ అవడంతో చివరకు పోలీసుల వరకూ వెళ్లింది. బాధిత బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Personality Test: మీ చేతి బొటనవేలిని ఇలా పెడుతున్నారా.. అయితే మీరు ఎలాంటి వారో ఈజీగా తెలుసుకోవచ్చు..
Updated Date - Dec 21 , 2023 | 06:18 PM