ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అంత్యక్రియలు చేసిన తండ్రి.. పిండం పెట్టి.. గుండు కొట్టించుకుని మరీ..!

ABN, First Publish Date - 2023-03-11T20:33:24+05:30

కుటుంబ సభ్యులకు తెలీకుండా మొదలయ్యే ప్రేమ వ్యవహారాలు.. కొన్నిసార్లు సుఖాంతమైతే, మరికొన్నిసార్లు విషాదాంతం అవుతుంటాయి. కూతురు ప్రేమను కొందరు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే.. మరికొందరు జీర్ణించుకోలేక, చివరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కుటుంబ సభ్యులకు తెలీకుండా మొదలయ్యే ప్రేమ వ్యవహారాలు.. కొన్నిసార్లు సుఖాంతమైతే, మరికొన్నిసార్లు విషాదాంతం అవుతుంటాయి. కూతురు ప్రేమను కొందరు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే.. మరికొందరు జీర్ణించుకోలేక, చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ అనుమతి లేకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు యువతి తండ్రి గుండు కొట్టించుకుని, పిండం పెట్టి మరీ అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) దిబియాపూర్ పరిధి ఔరయ్యా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాగిణి అనే యువతికి (young woman) తల్లిదండ్రులతో పాటూ ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. కాగా, ఇదే ప్రాంతానికి చెందిన సరాఫ్ అనే వ్యాపారి కొడుకు శివ అనే యువకుడు (young man).. రాగిణి ఇంటి ముందు నుంచే తన దుకాణం వద్దకు వెళ్లేవాడు. రోజూ వచ్చి పోయే క్రమంలో రాగిణితో చనువు ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. పెద్దలకు తెలీకుండా తరచూ కలుస్తూ ఉండేవారు. తర్వాత పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని రాగిణి.. తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే ఇందుకు వారు ఒప్పుకోలేదు. అయినా ఇద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..

ఇద్దరూ మేజర్లు కావడంతో ఇటీవల ఓ రోజు కుటుంబ సభ్యులకు తెలీకుండా ఆర్యసమాజ్‌కి (Arya Samaj) వెళ్లి వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి రాగిణి కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకున్నారు. దీంతో అందరి ముందే శివ తన ప్రియురాలి (girlfriend) చేయి పట్టుకుని, నేరుగా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో రాగిణి కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పారు. తన చెల్లెలు వివాహం తమకు ఇష్టం లేకుండా జరగిందన్న కోపంతో ఓ సోదరుడు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాగిణి తండ్రి, మరో సోదరుడు గుండు కొట్టించుకున్నారు. తమ కూతురు చనిపోయిందంటూ చివరకు తల్లిదండ్రులు పిండం కూడా పెట్టారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T20:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising