ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railway: రైలు ప్రయాణీకులకు ఇంపార్టెంట్ అలెర్ట్.. ఇప్పటిదాకా ఏసీ బోగీల్లో మాత్రమే వాటికి ట్రైన్ టికెట్.. ఇకపై..!

ABN, First Publish Date - 2023-05-06T15:23:25+05:30

తాజాగా రైల్వేశాఖ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై వాటికి కూడా రిజర్వేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ అవేంటో తెలియాలంటే

Indian Railway
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ప్రయాణమంటే ఎంత కష్టమో తెలిసిందే. నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా సీట్లు దొరకవు. అప్పటికే చాంతడంతా వెయిటింగ్ లిస్టు ఉంటుంది. చివరికి ప్రయాణ సమయం దగ్గర పడ్డాక టికెట్ కన్ఫాం కాకపోతే.. ఆ తర్వాత పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఇక ప్రయాణం అనగానే ఎంతో లగేజీ ఉంటుంది. వాటితో పాటు రకరకాలైన వస్తువులు తీసుకెళ్తుంటారు. పెద్ద వస్తువులు అయితే పార్శిల్‌ చేసి తీసుకెళ్తుంటారు. అయితే తాజాగా రైల్వేశాఖ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై వాటికి కూడా రిజర్వేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇకపై రైలు ప్రయాణాల్లో తమతో పాటు పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికెట్‌ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ (Indian Railway) పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్‌క్లాస్‌ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించేవారు. ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేషన్‌లోని పార్సిల్‌ కౌంటర్‌కు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. అలాగే సెకండ్‌ క్లాస్‌ లగేజ్‌ లేదా బ్రేక్‌వ్యాన్‌లో ఒక బాక్స్‌లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ఈ వ్యవహారం మొత్తం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు (animals) ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని పరిశీలిస్తోంది.

ఈ మేరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో (IRCTC) మార్పులు చేయాలని రైల్వేశాఖ సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వేశాఖ పరిశీలనలో ఉంది. దీని మీద అధ్యాయనం చేశాక.. వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Viral Video: భార్యతో కలిసి విమానం ఎక్కి.. మరో మహిళ రాగానే ఓ భర్త చేసిన నిర్వాకమిదీ.. ప్రయాణీకులంతా హడలిపోయారుగా..!

Updated Date - 2023-05-06T16:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising