ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: 2 ఏళ్ల బాలిక మిస్సింగ్.. అదే అపార్ట్మెంట్‌లో అత్త ఇంట్లో సోఫా కింద దొరికిన మృతదేహం.. ఏం చేశావని ఆమెను నిలదీస్తే..!

ABN, First Publish Date - 2023-10-18T19:09:51+05:30

కొన్నిసార్లు పెద్దల కోపానికి అణ్యంపుణ్యం ఎరుగని పిల్లలు బలవుతూ ఉంటారు. చాలా మంది చీటికీమాటికీ పిల్లలపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు పెద్దల కోపానికి అణ్యంపుణ్యం ఎరుగని పిల్లలు బలవుతూ ఉంటారు. చాలా మంది చీటికీమాటికీ పిల్లలపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు చివరకు పాప మృతదేహాన్ని అదే అపార్ట్మెంట్‌లో ఆమె అత్త మంచం కింద కనుగొన్నారు. అప్పటిదాకా పాపకు అన్నం తినిపంచిన అత్త.. చివరకు చిన్నారి ప్రాణాలు ఎందుకు తీసిందో తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షకీల్ మన్సూరి అనే వ్యక్తి.. భార్య, రెండేళ్ల కుమార్తెతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. మన్సూరి అత్త అఫ్సానా కుటుంబం కూడా వారి అపార్ట్‌మెంట్ రెండో అంతస్థులో ఉంటున్నారు. ఇదిలావుండగా, షకీల్ కూతురు ఇటీవల ఇంట్లో ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి పై అంతస్థులో ఉన్న అఫ్సానా ఇంటికి వెళ్లింది. లోపలికి వచ్చిన పాపకు అఫ్సానా భోజనం తినిపించింది. కాసేపటి తర్వాత కిందకు వెళ్లమని చెప్పింది. అయితే పాప మాత్రం కిందకు వెళ్లకుండా అక్కడే అల్లరి చేస్తూ ఉంది.

Woman: అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత సడన్‌గా మాట మార్చేసిన మహిళ.. క్షమించి వదిలేస్తారనుకుంటే ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

పాప అల్లరి చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆఫ్సానా.. చివరకు (Aunt assault on baby) పాపపై చేయి చేసుకుంది. అత్త కొట్టడంతో చిన్నారి ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది. దీంతో ఏడుపు ఆపేందుకు ఆమె.. పాప నోరు, ముక్కును మూసింది. ఈ కారణంగా ఊపిరాడక కాసేపటికి పాప మృతి చెందింది. దీంతో భయపడిపోయిన అఫ్సానా.. పాప మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టింది. తమ కుమార్తె కనిపించకపోవడంతో షకీల్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అపార్ట్‌మెంట్ మొత్తం వెతికే క్రమంలో మృతదేహం బయటపడింది. చివరకు అఫ్సానాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: నీ టాలెంట్‌కు సలాం తల్లీ.. సైకిల్ తొక్కుతూనే స్కిప్పింగ్ చేసిన యువతి..!

Updated Date - 2023-10-18T19:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising