Viral Video: మిడిల్ ఫింగర్ చూపించిన యాంకర్.. కెమెరాలో రికార్డు అవుతోందని తెలియదంటూ క్షమాపణలు..
ABN, First Publish Date - 2023-12-07T18:13:49+05:30
టీవీల్లో వార్తలు చెప్పే యాంకర్లు కొన్నిసార్లు అనుకోకుండా అదే వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా, బీబీసీ చానెల్ యాంకర్ ఒకరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీలో వార్తలు చదువుతున్న సమయంలో ఉన్నట్టుండి మిడిల్ ఫింగర్ చూపించింది. అయితే ...
టీవీల్లో వార్తలు చెప్పే యాంకర్లు కొన్నిసార్లు అనుకోకుండా అదే వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా, బీబీసీ చానెల్ యాంకర్ ఒకరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీలో వార్తలు చదువుతున్న సమయంలో ఉన్నట్టుండి మిడిల్ ఫింగర్ చూపించింది. అయితే వెంటనే అప్రమత్తమై.. మళ్లీ వార్తల్లోకి వెళ్లింది. అయితే ఈ క్లిప్ టీవీలో ప్రసారమైన వెంటనే నెటిజన్లు పసిగట్టేశారు. టీవీలో ప్రసారమైన వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో బీబీసీ చానెల్ యాంకర్ (BBC Channel Anchor) వీడియో వైరల్ అవుతోంది. BBC చీఫ్ ప్రెజెంటర్స్‌లో ఒకరైన మేరిమ్ మోషిరి అనే మహిళ లైవ్‌లో వార్తలు చదువుతుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వార్తల మధ్యలో విరామంలో ఆమె కెమెరామెన్ వైపు మధ్య వేలిని చూపిస్తూ హెచ్చరిస్తున్నట్లుగా కనిపించింది. లైవ్‌లో కనపడగానే వెంటనే అప్రమత్తమై మళ్లీ యథావిధిగా వార్తలు చదువుతూ వెళ్లింది. అయితే ఆమె వేలు చూపిచండం లైవ్‌లో కనిపించడంతో అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
చివరకు ఈ వీడియో నెట్టింట్లోకి చేరడంతో మరింత వైరల్ అయింది. దీంతో ఈ విషయం చానెల్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీనిపై యాంకర్ మోషిరి గురువారం మాట్లాడుతూ తాను వేలు చూపించడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కెమెరా బృందంతో సరదాగా వ్యాఖ్యానిస్తూ అలా వేలు చూపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. డైరెక్టర్ 10 నుంచి 0వరకూ కౌంట్ డౌన్ ఇవ్వడంతో నంబర్లను వేలితో చూపించే క్రమంలో అలా ఒకటి సంఖ్యను చూపించాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది లైవ్‌లో కనిపిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ ఘటనపై మోషిరి క్షమాపణలు తెలియజేశారు. కాగా, ఈ వీడియో చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు యాంకర్‌ను సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
Updated Date - 2023-12-07T18:13:50+05:30 IST