Viral News : సోషల్ మీడియాలో రామోజీరావు ఫొటో వైరల్.. ఇందులో నిజమెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆరాతీస్తే..!
ABN, First Publish Date - 2023-04-03T19:19:29+05:30
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు (Eenadu Groups Chairperson CH Ramoji Rao) సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు (Eenadu Groups Chairperson CH Ramoji Rao) సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన బెడ్ మీద పడుకుని ఉన్నట్లు ఉండే ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా (Social Media) కొందరు వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు రామోజీరావుకు ఏమైంది..? ఆయన అనారోగ్యానికి గురయ్యారా..? ఈ ఫొటో పాతదా..? అసలు ఒరిజనాలా..? కాదా..? లేకుంటే మార్ఫింగ్ చేసి ఇలా ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారా..? ఓ వైపు మార్గదర్శి కేసులో సీఐడీ (CID) విచారణ జరుగుతుండగా రామోజీరావు ఫొటో వైరల్ కావడంతో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలెంత.. అనే విషయాన్ని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఫ్యాక్ట్ చెక్ (ABN Andhrajyothy Fact Check) చేసింది.
ఫొటో వెనుక కథ ఇదీ..!
రామోజీరావు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇందులో నిజానిజాలెంత..? సోషల్ మీడియాలో ఎందుకిలా వైరల్ చేస్తున్నారని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్దారణ) చేసింది. అవును.. రామోజీరావు అనారోగ్యంతో ఉన్నారని ఏబీఎన్ ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. వయసు రీత్యా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం తన కుమారుడు కిరణ్ నివాసంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. రామోజీరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో (Margadarsi Chit Funds Case) రామోజీరావును బెడ్‌పైనే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి విచారణ జరుగుతోంది. ఈ ఫొటో ఎవరు తీశారో.. ఏమిటో తెలియట్లేదు కానీ.. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏమిటీ మార్గదర్శి కేసు..!?
గత కొన్నిరోజులుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనమైంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి ఏపీ సీఐడీ (AP CID) రంగంలోకి దిగింది. చిట్ ఫండ్స్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చింది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించారని 420, 409, 120-B, 477-A , R/W34 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి.. రామోజీరావును ఏ1గా, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల ఎండి చెరుకూరి శైలజా కిరణ్‌లను (Sailaja Kiran ) ఏ2గా అధికారులు తేల్చారు. దీంతో సోమవారం నాడు హైదరాబాద్‌లోని శైలజా కిరణ్ నివాసంలో సీఐడీ విచారిస్తోంది. రామోజీరావును కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయమే నాలుగు వాహనాల్లో వచ్చిన 30 మంది అధికారుల బృందం ఈ ఇరువురి నివాసానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. అయితే శైలజను మాత్రం ప్రత్యేక మహిళా సీఐడీ టీమ్ విచారిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు, మూడు గంటలపాటు విచారణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. విచారణకు సంబంధించి 160 సీఆర్పీసీ కింద గతంలో సీఐడీ నోటీసులు జారీచేసింది. ఇప్పటికే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. నలుగురు బ్రాంచ్ మేనేజర్లను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది.
కాగా.. కొందరు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు అయితే చిత్రవిచిత్రాలు ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. మార్గదర్శి కేసులో విచారణ జరుగుతున్న సమయంలో రామోజీరావు ఫొటో ఇలా వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫ్యాక్ట్ చెక్‌తో రామోజీరావు అభిమానులు కాస్త రిలీఫ్ అయ్యారు. సో.. చూశారుగా ఇదీ ఈ ఫొటో వెనకున్న కథ.
*****************************
ఇవి కూడా చదవండి..
*****************************
YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!
*****************************
YSRCP Meeting : టెన్షన్ టెన్షన్‌గా కీలక సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. టికెట్లు ఎవరెవరికో తేల్చి చెప్పేసిన సీఎం జగన్..
*****************************
Updated Date - 2023-04-03T19:26:49+05:30 IST