ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బెంగళూరు బస్సులో ఏం జరిగిందో మీరే చూడండి.. అయినా ఇదేం పనమ్మా..!

ABN, First Publish Date - 2023-07-28T20:49:40+05:30

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం కొన్ని వేల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యం పొందాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. అయితే.. ఈ గుర్తింపు కార్డు చూపించే విషయంలో బెంగళూరులోని ఒక బస్సు కండక్టర్‌తో మహిళ వాగ్వాదానికి దిగింది.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం కొన్ని వేల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యం పొందాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. అయితే.. గుర్తింపు కార్డు చూపించే విషయంలో బెంగళూరులోని ఒక బస్సు కండక్టర్‌తో మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుర్తింపు కార్డు చూపించమని కండక్టర్ అడిగితే ఆ మహిళ తాను సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్‌నని రుబాబు చేసింది.


బస్సుల్లో ఇతర ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా నిలిచి ఐడీ కార్డు చూపించమని ఆమెను కోరినా అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. పైగా.. తనపై దౌర్జన్యానికి దిగారనే రీతిలో తన స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసి మరీ ఆ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ దురుసు ప్రవర్తనపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని చెబుతున్న మహిళ.. బస్ ఛార్జీ గురించి కండక్టర్‌తో గొడవ పడటం ఏంటని నిలదీశారు. అయినా ఆ యువతి వీడియో తీసి పోస్ట్ చేయడానికి మొబైల్ డేటాకు ఎంత ఖర్చవుతుందో ఆ డబ్బుతో టికెట్ కొనుక్కోవచ్చని ఆ వీడియో చూసిన వారిలో కొందరు అభిప్రాయపడిన పరిస్థితి.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు పూర్తి భిన్నమైన మరో ఘటన కర్ణాటక ఆర్టీసీ బస్సులో జరిగింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడికి, కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సదరు ప్రయాణికుడిపై కండక్టర్ దాడి చేస్తున్న దృశ్యం కనిపించింది. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గట్టిగా అరచి చెబుతున్నాడు. బస్సులో ఆ యువకుడి దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకోవాలని అడిగానని, ఆ యువకుడు పొగరుగా సమాధానం చెబుతున్నాడని, టికెట్‌కు డబ్బులివ్వనని మొండికేస్తున్నాడని చెబుతున్నాడు. ఆ ఘటన మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 2.85 లక్షల మంది వీక్షించారు.

Updated Date - 2023-07-28T20:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising