Bengaluru: బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం.. రైడ్ క్యాన్సిల్ చేసిందని క్యాబ్ డ్రైవర్ ఎలా పగ తీర్చుకున్నాడంటే..
ABN , First Publish Date - 2023-10-14T19:06:59+05:30 IST
క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసినందుకు ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కేవలం రైడ్ క్యాన్సిల్ చేసిందనే కారణంతో మహిళపై ఆగ్రహం పెంచుకున్న క్యాబ్ డ్రైవర్ వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

క్యాబ్ (Cab) బుక్ చేసి క్యాన్సిల్ చేసినందుకు ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కేవలం రైడ్ క్యాన్సిల్ (Cancel Ride) చేసిందనే కారణంతో మహిళపై ఆగ్రహం పెంచుకున్న క్యాబ్ డ్రైవర్ (Cab Driver) వెకిలిగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. బెంగళూరు (Bengaluru)లో ఈ ఘటన జరిగింది.
బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఎలక్ట్రానిక్ సిటిలో నివసిస్తోంది. గత సోమవారం ఆమె షాపింగ్ వెళ్లడం కోసమని క్యాబ్ బుక్ చేసింది. అయితే క్యాబ్ ఎంత సేపటికీ రాలేదు. డ్రైవర్‌కు ఫోన్ చేస్తే ``వస్తా..`` అని చెబుతున్నాడు కానీ.. లేట్ అవుతోంది. దీంతో ఆ మహిళ ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసి ఆటో బుక్ చేసుకుంది. ఆ మహిళ రైడ్ క్యాన్సిల్ చేసిందనే కారణంతో క్యాబ్ డ్రైవర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను వేధించాలని నిర్ణయించుకున్నాడు. తన మొబైల్ నుంచి ఆమె వాట్సాప్ నెంబర్‌కు అసభ్యకర వీడియోలు, ఫొటోలు పంపించాడు (Crime News).
Shocking Crime: చెల్లెలి తల నరికేసిన అన్న.. మధ్యప్రదేశ్‌లో షాకింగ్ క్రైమ్.. ఆ అన్న ఆగ్రహానికి కారణమేంటంటే..
నేరుగా ఆ మహిళకు ఫోన్ చేసి వాట్సాప్ చెక్ చేసుకోవాలని సూచించాడు. ఆ ఫొటోలు, వీడియోలు చూసి ఆ మహిళ షాకైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ డ్రైవర్ గురించి అన్వేషణ ప్రారంభించారు. సెల్‌ఫోన్ ఆధారంగా ట్రేస్ చేయగా ఆ వ్యక్తి ప్రస్తుతం తమిళనాడులో ఉన్నట్టు బయటపడింది. అతడిని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులు ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.