ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore: ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ లాక్కుని.. నేలకేసి కొట్టి.. ఓ ఆటో డ్రైవర్ వార్నింగ్.. వేరే దేశం నుంచి వచ్చి మరీ మా పొట్ట కొడుతున్నారంటూ..

ABN, First Publish Date - 2023-03-08T17:01:46+05:30

నగరాల్లో జనాభా పెరిగాక.. రోడ్లు ఖాళీగా ఉండటం లేదు. బస్సులు ఖాళీగా ఉండటం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సమయం ప్రయాణానికే సరిపోతుంది. ఇక ఎమర్జెనీ

మా పొట్ట కొడుతున్నారంటూ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నగరాల్లో జనాభా పెరిగాక.. రోడ్లు ఖాళీగా ఉండటం లేదు. బస్సులు ఖాళీగా ఉండటం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సమయం ప్రయాణానికే సరిపోతుంది. ఇక ఎమర్జెనీ పనులు పెట్టుకుని బస్సుల్లో వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వృధా అయిపోతుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతలు. టైమ్ అంతా వేస్ట్‌ అయిపోయిందంటూ బాధపడిన సంఘటనలు ఎన్నో ఎదుర్కొన్నాం. ఇలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయటకు కదలాలంటే ట్యాక్సీనో.. ఆటోనో ఆశ్రయిస్తుంటాం. ఈ క్రమంలో దేశంలోని పలు నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ప్రైవేటు ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో సిటీల్లో ఆటోలకు గిరాకీ పడిపోయింది. అంతే మా పొట్ట కొడతారా? అంటూ ఓ ఆటో డ్రైవర్ చేసిన వీరంగం ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్నాటక (Karnataka)లో చోటుచేసుకుంది.

బెంగళూరులోని (Bangalore) ఇందిరానగర్‌ మెట్రోస్టేషన్‌ దగ్గర ఓ ఆటో డ్రైవర్‌ (Auto driver).. ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి హెల్మెట్ (Helmet) లాక్కుని ఆవేశంతో​ నేలపై కొట్టి.. భౌతికదాడి చేయబోయాడు. అనంతరం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ హఠాత్తు పరిణామాంతో బైక్ ట్యాక్సీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. బిత్తర మొఖంతో వణికిపోయాడు.

ఇది కూడా చదవండి: Cheetah: రైలు ఇంజిన్‌పై చిరుత.. పడుకుందేమో అని అనుకున్నారు.. భయంభయంగానే వెళ్లి చూస్తే..

ఆటో డ్రైవర్‌ మాట్లాడుతూ.. ‘మిత్రులారా... అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి రాజు ఇక్కడ బైక్‌ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోయింది. వేరే దేశానికి చెందిన అతడు వైట్ నంబర్‌ ప్లేట్‌ బోర్ట్‌ ఉన్నప్పటికీ ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు’ అంటూ సీరియస్‌ అయ్యాడు.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్‌ పోలీసుల ఫిర్యాదు చేశాడు. వీడియో ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. సదరు ఆటోడ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Cigarettes: ఇక్కడ దేవుడికి సిగరెట్లే నైవేద్యం.. ఇలా చేస్తేనే కోరికలు తీరతాయని అపారమైన నమ్మకం..!

Updated Date - 2023-03-08T17:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising