కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

ABN, First Publish Date - 2023-09-05T21:17:23+05:30

పులులు, సింహాలను బోనులో చూసినా భయమేస్తూ ఉంటుంది. అలాంటిది ఇక బయట ఎదురుపడితే దాదాపు గుండె ఆగినంత పనవుతుంది. వాహనాల్లో వెళ్తున్న వారు కూడా పులులు, సింహాలను చూస్తే భయపడి ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

పులులు, సింహాలను బోనులో చూసినా భయమేస్తూ ఉంటుంది. అలాంటిది ఇక బయట ఎదురుపడితే దాదాపు గుండె ఆగినంత పనవుతుంది. వాహనాల్లో వెళ్తున్న వారు కూడా పులులు, సింహాలను చూస్తే భయపడి ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలోనూ సింహాలను చూసి వాహనాలు ఆగిపోయాయి. అయితే ఓ అరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా దూసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. అటవీ సమీప ప్రాంతంలోని రోడ్డుపై కొన్ని సింహాలు పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. రెండు సింహాలు రోడ్డు మధ్యలో పడుకుని ఉండగా.. మరో సింహం రోడ్డు పక్కగా (Lions sleeping on the road) పడుకుని ఉంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనాలు.. సింహాలను చూసి ఆగిపోతాయి. ఎంతకీ సింహాలు అక్కడి నుంచి కదలకపోవడంతో వారు కూడా వాహనాలను ఆపుకొని వేచి చూస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి అరటి పండ్లను బైకుపై (bike) వేసుకుని అటుగా వస్తుంటాడు. వాహనాలు రోడ్డుపై ఆగిన విషయాన్ని గమనించకుండా తన మానాన తాను వచ్చేస్తాడు.

Shocking: డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఆటో ఎక్కిందో యువతి.. కొద్దిదూరం వెళ్లగానే ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు..!

వాహనాలను దాటిన తర్వాత పక్కనే సింహాలు పడుకుని ఉండడం చూసినా ఏమాత్రం భయపడకుండా.. అటు నుంచి అటే నేరుగా వెళ్లిపోతాడు. ఇతన్ని చూసి అటువైపు దారి అడ్డుగా ఉన్న వాహన డ్రైవర్ కూడా దారి ఇచ్చేస్తాడు. రోజూ మాకు ఇది అలవాటే.. అన్నట్లుగా ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సింహాలు కూడా అతన్ని చూసినా మిన్నకుండిపోతాయి. ఈ ఘటనను వాహనాల్లో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతడు అర్జంట్ పని మీద వెళ్తున్నాడనే విషయాన్ని.. సింహాలు అర్థం చేసుకున్నాయి’’.. అని కొందరు, ‘‘అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఇది అలవాటే’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! ఈ బైకర్‌కు ధైర్యం ఎక్కువే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్.. రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఏ ఆటో డ్రైవరైనా ఇలా చేస్తాడా..

Updated Date - 2023-09-05T21:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising