Scool Boy: స్కూలు బస్సు వస్తుందనుకుంటే.. చావే వెంటాడుతూ వచ్చింది.. ఈ పిల్లాడు రోడ్డు పక్కన ఎదురు చూస్తోంటే..!
ABN, First Publish Date - 2023-07-14T16:28:18+05:30
తమ కొడుకు బాగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అందుకోసం రెక్కలుముక్కలు చేసుకుని కష్టపడుతూ.. కొడుకును ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. బాలుడు కూడా ఎంతో బాగా చదువుకునేవాడు. ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో...
తమ కొడుకు బాగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అందుకోసం రెక్కలుముక్కలు చేసుకుని కష్టపడుతూ.. కొడుకును ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. బాలుడు కూడా ఎంతో బాగా చదువుకునేవాడు. ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోసుకుంది. అప్పటిదాకా తమ కళ్ల ముందు ఉన్న కొడుకు.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంటాడని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. పాఠశాలకు వెళ్లేందుకు స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తుంటే.. చివరకు చావే వెంటాడుతూ వచ్చింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని (Haryana) ఝజ్జర్ జిల్లా రుడియావాస్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోహిత్ అనే విద్యార్థి.. (student) స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్‌కి వెళ్లడం, ఇంటికి రాగానే తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవడం చేస్తుండేవాడు. ఇంత ఆనందంగా సాగుతున్న ఈ పిల్లాడి జీవితం.. ఇంత త్వరగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇటీవలో ఓ రోజు పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం (electric pole) ఒక్కసారిగా విరిగిపోయి విద్యార్థిపై పడింది.
Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!
ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి (boy died) చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బాలుడి తాత అక్కడే ఉన్నాడు. మనువడిని రక్షించుకునే క్రమంలో అతడికీ గాయాలయ్యాయి. చుట్టు పక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్నిపరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతంరం కారకులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?
Updated Date - 2023-07-14T16:28:18+05:30 IST