ఇద్దరు యువకుల ప్రేమాయణం.. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన ఓ కుర్రాడి తల్లి.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-01-31T21:24:25+05:30
సోషల్ మీడియా ద్వారా కొన్నిసార్లు యువతీయువకుల మధ్య పరిచయాలు ఏర్పడుతుండగా, మరికొన్నిసార్లు యువకుల మధ్య ఏర్పడుతుంటాయి. చివరకు ఈ పరిచయాలే ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. ఇంకొన్ని పరిచయాలు..
సోషల్ మీడియా ద్వారా కొన్నిసార్లు యువతీయువకుల మధ్య పరిచయాలు ఏర్పడుతుండగా, మరికొన్నిసార్లు యువకుల మధ్య ఏర్పడుతుంటాయి. చివరకు ఈ పరిచయాలే ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. ఇంకొన్ని పరిచయాలు.. చివరకు స్వలింగ సంపర్కానికి దారి తీస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువకుల మధ్య ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. చివరకు ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ఘటనలో చివరకు ఓ కుర్రాడి తల్లి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో గోమతి నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి, ఇంటీరియర్ డెకరేషన్ (Interior decoration) పని చేస్తున్నాడు. ఇతడికి ఎనిమిదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో (Facebook friendship) వికాస్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇతడు కూడా ఇంటీరియర్ డెకరేషన్ పని చేస్తుండడంతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లకు వీరి మధ్య స్నేహం మొదలైంది. క్రమంగా ఒకరి నంబర్ల ఇంకొకరు తీసుకున్నారు. కొన్ని నెలలకు వీరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. తరచూ కలుస్తూ చివరకు ఇద్దరూ స్వలింగ సంపర్కానికి (Homosexuality) అలవాటు పడ్డారు. అయితే ఇటీవల కొంత కాలం నుంచి వికాస్ తన ప్రవర్తనను మార్చుకున్నాడు.
అప్పటి నుంచి విక్రమ్‌ను దూరం పెడుతూ వచ్చాడు. విక్రమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించే వాడు కాదు. దీంతో వికాస్‌పై విక్రమ్ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చువాలని భావించాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడైన మోహిత్ కుమార్‌కు చెప్పి పక్కా స్కెచ్ వేశారు. ఇటీవల ఓ రోజు వికాస్ ఇంటికి వెళ్లారు. కారు బ్యాటరీలోని యాసిడ్‌ను వారి ఇంటిపై చల్లడంతో పాటూ లోపల ఉన్న వికాస్, అతడి తల్లిపై కూడా చల్లేశారు. ఈ ఘటనలో వికాస్ తీవ్రంగా గాయపడగా, అతడి తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.
అనంతరం విక్రమ్, అతడి స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఢిల్లీ ఉన్న వారిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. విచారణలో విక్రమ్ స్నేహితుడు.. గతంలో ఓ దాడి కేసులో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిసింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కూతురు కోసం ఐదు వేల రూపాయలు అప్పు చేసిన తల్లి.. ఓ రోజు ఆస్పత్రికి తీసుకెళ్లగా బయటపడిన అసలు రహస్యం..
Updated Date - 2023-01-31T21:24:31+05:30 IST