ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BTech Pani Puri Wali: ఎవరీ తాప్సి.. పానీపూరీ అమ్ముకుంటున్న 21 ఏళ్ల ఈ యువతి సడన్‌గా ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..

ABN, First Publish Date - 2023-03-10T15:53:12+05:30

పానీపూరీ అమ్ముతూ ట్రెండ్ అవుతున్న ఈ యువతి ఆలోచన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాప్సి పేరు వినగానే ఒకప్పుడు రెడ్ ఎఫ్ఎమ్ యాడ్(Red FM Add) తో పరిచయమయ్యి, ఆ తరువాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తెలుగువారిని మెప్పించిన తాప్సి పన్ను(Heroine Tapsee Pannu) గుర్తుకొస్తుందేమో.. కానీ పానీపూరీ అమ్ముతూ హీరోయిన్ తాప్సికి ఏమీ తీసిపోకుండా సెలబ్రిటీ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ తాప్సి ఉపాధ్యాయ్. 21ఏళ్ళ ఈ అమ్మాయి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో పానీపూరీ బండి తీసుకెళ్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్న ఈ అమ్మడు గురించి తెలుసుకుంటే..

బి.టెక్ చదివేటప్పుడు చాలా మంది కల ఎలా ఉంటుంది? క్యాంపస్ సెలక్షన్స్ లోనే మంచి ప్యాకెజీతో జాబ్ వచ్చెయ్యాలని, మంచి కంపెనీలో ఉద్యోగం దొరకాలని చాలా మంది కల. కానీ తాప్సీ ఉపాధ్యాయ మాత్రం బి.టెక్ అలా కంప్లీట్ అవ్వగానే ఇలా పానీపూరీ సెల్లర్ గా మారిపోయింది. బి.టెక్ పానీపూరీ వాలీ అనే పేరు పానీపూరీ బండి మీద రాయించి పానీ పూరీ అమ్మడం మొదలుపెట్టింది. తాప్సీ ఇలా పానీపూరీ అమ్ముతుంటే చాలామంది 'అమ్మాయిలు ఇలా రోడ్లమీద పానీపూరీ అమ్మడం ఏంటి ఇంటికి వెళ్ళు' అని విమర్శిస్తున్నారు. 'బి.టెక్ చదివి చివరికి పానీపూరీ అమ్ముకుంటున్నావా..' అని మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎవరిమాటలు పట్టించుకోలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కు తన పానీ పూరీ బండి అటాచ్ చేసి ఢిల్లీ వీధులలో వెళుతుంటే జనాలంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఆర్ యు హంగ్రీ(are_you_hungry007) అనే పేజీ ఉంది. ఇందులో తాప్సి కి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తాప్సి ఉపాధ్యాయ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్(Royal Enfield Bike) కు తన పానీపూరీ బండిని అటాచ్ చేసి ఢిల్లీలోని తిలక్ నగర్(Tilak Nagar in Delhi) కు వెళుతుంది. ఇక్కడ ఆమె తను పానీపూరీ అమ్మడానికి తెచ్చిన పానీపూరీలు, ఇంట్లో ఆరోగ్యకరమైన పద్దతిలో తయారుచేసిన పానీ, చింతపండు, ఖర్జూరం, బెల్లం కలిపి తయారుచేసిన స్వీట్ చెట్నీ చూపించింది. పానీపూరి తయారు చేసి కస్టమర్ కు సర్వ్ చేసింది. ఈమె అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పానీపూరీలు నూనెలో వేయించకుండా ఎయిర్ ఫ్రయర్ లో వేయిస్తుందట. తన స్టాల్ నుండి మరిన్ని ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ లను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఈమె వెబ్సైట్ ద్వారా తెలిసింది. చిన్నవయసులోనే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టిన ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. 'ఎవరి మాటలు పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళు సిస్' అని ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో వ్యాపారసామ్రాజ్యంలో ఈమె గొప్ప స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

Read also: ఒక్కరోజులోనే హనీమూన్‌ నుంచి తిరిగొచ్చేసిన కొత్త పెళ్లి జంట.. మర్నాడే భర్తపై కేసు పెట్టిన భార్య.. అసలు కారణమేంటంటే..


Updated Date - 2023-03-10T16:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising