పెళ్లి మండపం వరకు వచ్చి.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెనక్కి వెళ్లిపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-02-13T15:04:05+05:30 IST
ఆ తండ్రి తన కూతురు ఇష్టపడిన వాడితోనే పెళ్లికి అంగీకరించాడు.. వరుడి తరఫు వారితో కట్న కానుకలు మాట్లాడుకుని ఈ నెల 9వ తేదీన పెళ్లికి ముహూర్తం పెట్టించాడు.. నగదుతో పాటు బైక్ కూడా ఇస్తానని అంగీకరించాడు..
ఆ తండ్రి తన కూతురు ఇష్టపడిన వాడితోనే పెళ్లికి అంగీకరించాడు.. వరుడి తరఫు వారితో కట్న (Dowry) కానుకలు మాట్లాడుకుని ఈ నెల 9వ తేదీన పెళ్లికి ముహూర్తం పెట్టించాడు.. నగదుతో పాటు బైక్ కూడా ఇస్తానని అంగీకరించాడు.. ఊరేగింపుతో కల్యాణ మండపానికి చేరుకున్న వరుడు కాబోయే మామగారిని పిలిచి బాంబు పేల్చాడు.. తనకు బైక్ వద్దని, కారు కావాలని డిమాండ్ చేశాడు.. షాకైన వధువు తండ్రి కారు ఇవ్వలేమని చెప్పాడు.. దీంతో వరుడు డ్రామా మొదలుపెట్టాడు.
హర్యానాలోని (Haryana) చర్కిదాద్రికి చెందిన యువతికి భివానీకి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ నెల 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కాబోయే మామగారు ఇస్తానన్న బైక్ వద్దని, కారు కావాలని డిమాండ్ చేశాడు. సాయంత్రం లోపు కారు ఉండాలని ఆదేశించాడు. అయితే వధువు తండ్రి అప్పటికప్పుడు కారు తీసుకురావడం కష్టమని వరుడికి నచ్చ చెప్పాడు. మూహూర్తం దగ్గరపడుతున్న సమయంలో వరుడు డ్రామా మొదలుపెట్టాడు. తనకు తలనొప్పి వస్తోందని, హాస్పిటల్కు వెళ్లాలని చెప్పాడు (Groom absconded from wedding).
Viral Video: వధూవరుల తలంబ్రాల సీన్లోకి ఎంటరైన కోతి.. అది చేసిన పనికి అందరూ షాక్!
తన తల్లితో కలిసి దగ్గర్లో ఉన్న హాస్పిటల్కు వెళ్తానని వధువు తరఫు వారికి చెప్పాడు. ముహూర్తం దగ్గరపడుతున్నా వరుడు రాకపోవడంతో వరుడి తండ్రి హాస్పిటల్కు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఎంక్వైరీ చేస్తే కారు ఇవ్వలేదనే కోపంతో వరుడు పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయాడని తెలిసి వధువు తండ్రి అవాక్కయ్యాడు. ఆ తర్వాత మొత్తం విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.