Cashew Price: మార్కెట్లో కిలో జీడిపప్పు వెయ్యి రూపాయలకు పైనే.. కానీ ఇక్కడ మాత్రం కేవలం 30 రూపాయలకే..!

ABN , First Publish Date - 2023-03-28T17:05:26+05:30 IST

జీడిపప్పు ఎంత రుచికరంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జీడిపప్పే. అంతేకాదు ప్రతీ వంటకంలో

Cashew Price: మార్కెట్లో కిలో జీడిపప్పు వెయ్యి రూపాయలకు పైనే.. కానీ ఇక్కడ మాత్రం కేవలం 30 రూపాయలకే..!
30 రూపాయలకే..!

జీడిపప్పు ఎంత రుచికరంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జీడిపప్పే. అంతేకాదు ప్రతీ వంటకంలో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. కర్రీ రుచిగా ఉంటుంది. చక్కని గ్రేవీ వస్తుంది. అంత ఎక్కువగా జీడిపప్పును వాడుతుంటారు. అలాగని కూరగాయాలు కొన్నంత చవకగా మాత్రం దొరకదు. చాలా కాస్ట్‌లీ ఉంటుంది. అందుకే పేదలు, సామాన్యులు జీడిపప్పు కొనేందుకు భయపడుతుంటారు. కానీ ఇదే జీడిపప్పు... కూరగాయాల ధర కంటే తక్కువగా కిలో జీడిపప్పు దొరికేస్తోంది. ఎక్కడో.. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

జీడిపప్పు (Cashew) కిలో వెయ్యి రూపాయిలకు పైగానే ఉంటుంది. ఇక వీటిల్లో గ్రేడ్‌లు కూడా ఉంటాయి. క్వాలిటీని బట్టి ఒక్కొక్క రకాన్ని బట్టి ఒక్కొక్క ధరలో అమ్ముతుంటారు. కిలో 600 నుంచి 1000 రూపాయిలకు పైగా ధర పలుకుతుంటుంది. అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.

జార్ఖండ్‌ (Jharkhand)లోని జంతార అనే జిల్లా నాలా అనే గ్రామం ఉంది. దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరం’గా పిలుస్తారు. ఈ గ్రామంలో కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలకే దొరుకుతుంది. అంటే మార్కెట్‌లో దొరికే కూరగాయలు కంటే తక్కువగా లభిస్తుంది. అందుకే సమీప గ్రామాల వారు.. ఆయా నగరాల నుంచి వచ్చి జీడిపప్పును కొనుగోలు చేసుకుని తీసుకెళ్తుంటారు. అంతేకాదు ఇక్కడ నుంచే దళారులు కొని బయట ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటారు. అందుకే ఎప్పుడైనా జార్ఖండ్‌ వెళ్లే పరిస్థితి వస్తే ఓ రెండు మూడు కిలోల జీడిపప్పును తెచ్చి పెట్టుకుంటే ఏడాదంతా సరిపోతుంది.

ఇది కూడా చదవండి: BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..

నాలా గ్రామంలో రైతులందరూ జీడి తోటలనే పెంచుతుంటారు. అంతేకాకుండా అధికారులు కూడా జీడితోటలనే పెంచేలా ప్రోత్సహిస్తుంటారు. కానీ ఇంత తక్కువ ధరకు అమ్మడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పైగా ఇక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా లేవు. ప్రాసెసింగ్ ప్లాంట్ చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు జీడిపప్పు ధర పెరిగే అవకాశం కూడా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..

Updated Date - 2023-03-28T17:05:26+05:30 IST