Traffic Rules: ట్రాఫిక్ పోలీసుల కొత్త సిస్టమ్.. రూల్స్ బ్రేక్ చేసిన వెంటనే నడివీధుల్లోకి వాహనదారుల బాగోతం..!
ABN, First Publish Date - 2023-06-24T17:05:23+05:30
ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులు తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఎన్ని జరిమానాలు విధించినా.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. దీంతో కొన్నిసార్లు అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ..
ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులు తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఎన్ని జరిమానాలు విధించినా.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. దీంతో కొన్నిసార్లు అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై వాహనదారులు షాక్ అవుతున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వెంటనే వాహనదారుల బాగోతాన్ని నడివీధిలో పెడుతుండడం చూసి బాబోయ్.. ఇవేం రూల్స్.. అంటూ వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. రెడ్ లైట్ సిగ్నల్ జంప్ (Red light signal jumping) చేసే వారికి చెక్ పెట్టేందుకు చెన్నై ట్రాఫిక్ పోలీసులు (Chennai Traffic Police) వినూత్నం నిర్ణయం తీసుకున్నారు. చెన్నైకి సంబంధించినదిగా చెబుతున్న ఈ వీడియోపై వాహదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ రోడ్డుపై సిగ్నల్ లైట్ల స్తంభానికి పెద్ద స్క్రీన్ (Screen) అమర్చి ఉంటుంది. వాహనదారులు ఎవరైనా సిగ్నల్ జంప్ చేస్తే.. వెంటనే సదరు వాహన యజమానికి సంబంధించిన ఫొటో, బండి నంబర్, ఫైన్ వివరాలన్నీ స్తంభంపై ఉన్న స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
వీడియోలో ఓ యువకుడు సిగ్నల్ జంప్ చేయగానే.. వెంటనే అతడి ఫొటోతో పాటూ (motorist Photo and details) వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీన్ని చూసి అక్కడే ఉన్న పాదచారులు అవాక్కవుతారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇవేం రూల్స్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేస్తే ఎవరూ నిబంధనలు అతిక్రమించరు’’.. అని మరికొందరు, ‘‘చెన్నైలో ఇలాంటిదేమీ లేదే’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఇది నకిలీ వీడియో’’.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-06-24T17:05:23+05:30 IST