ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Woman: పాములంటే ఇంత ఇష్టమేంటి తల్లీ.. 16 ఏళ్ల వయసు నుంచే ఈ యువతి ఏం చేస్తోందంటే..!

ABN, First Publish Date - 2023-11-23T18:04:28+05:30

పాములంటే ఎవరికీ ఇష్టం ఉండదు. పైగా వాటిని కనీసం దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడరు. అయితే కొందరు మాత్రం వాటిని పెంపుడు జంతువుల తరహాలో చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. ఎలాంటి పామునైనా...

పాములంటే ఎవరికీ ఇష్టం ఉండదు. పైగా వాటిని కనీసం దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడరు. అయితే కొందరు మాత్రం వాటిని పెంపుడు జంతువుల తరహాలో చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. ఎలాంటి పామునైనా చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అయితే ఇలాంటి వారిలో ఎక్కువగా పురుషులే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతికి మాత్రం పాములంటే చాలా ఇష్టమట. 16 ఏళ్ల వయసు నుంచే ఆమె వాటిపై ఇష్టాన్ని పెంచుకుందట. ఇంతకీ ఆమె ఎవరు, 9 ఏళ్లుగా ఏం చేస్తోంది... అన్న వివరాల్లోకి వెళితే..

చెన్నైకి (Chennai) చెందిన వేదప్రియ గణేశన్ అనే యువతి (young woman).. ప్రస్తుతం వెస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్‌కు (Western Ghats Wildlife Conservation Trust) చీఫ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోంది. స్థానికంగా ఎక్కడ పాములు కనిపించినా అందరికీ వేదప్రియే గుర్తుకొస్తుంది. వెంటనే ఆమె సమాచారం అందిస్తుంటారు. ఇక వేదప్రియ విషయానికొస్తే.. ఈమెకు వన్యప్రాణాలపై అమితమైన ప్రేమ. అందులోనూ పాములంటే ఎంతో ఇష్టం. 16 ఏళ్ల వయసులోనే వేదప్రియ.. జంతువులు, పాములపై ప్రేమ పెంచుకుంది. ఈ యువతి చదువుకునే రోజుల్లో పొరుగింట్లో చిన్నారి ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. దీంతో అంతా బయటికి పరుగుందుకున్నారు. చుట్టుపక్కల వారు కూడా చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు.

Rusk Making Video: రస్కులు తినే అలవాటుందా..? ఎలా చేస్తున్నారో చూస్తే కొనడానికి కూడా భయపడతారేమో..!

ఆ సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లిన వేదప్రియ.. పాము బల్లిని తినడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసింది. అప్పటినుంచి ఎక్కడ పాములు కనిపించినా వెంటనే వెళ్లి వాటిని రక్షిస్తుండేది. ఈ క్రమంలో ఆమె విషసర్పాలను పట్టుకోవడంలో శిక్షణ తీసుకోవాలని భావించింది. ఇందుకోసం తన స్నేహితుల ద్వారా ఇరుల తెగకు చెందిన వారిని కలిసింది. సాధారణంగా ఈ తెగ వారు ఎవరికీ శిక్షణ ఇవ్వరు. అయితే వారి తెగలో ఓ యువకుడు తన స్నేహితుడు కావడంతో చివరకు యువతి కోరికను వారు మన్నించారు. ఇలా వారి ద్వారా కోబ్రా వంటి విషపూరిత పాములను (Training in snake catching) పట్టడంలో శిక్షణ తీసుకుంది.

Old Man: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 60 ఏళ్ల వృద్ధుడు.. రూ.32 లక్షలు ఎలా పోయాయన్నది చెప్పగానే..!

అలాగే వేదప్రియ కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా చేసింది. అనంతర కాలంలో అనేక జంతు సంక్షేమ సంస్థలు (Animal welfare organizations), సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్లాక్రాస్, బిసెంట్ మెమోరియల్ యానిమల్ డిస్పెన్సరీలతో కలిసి పని చేసింది. 9ఏళ్ల కాలంలో వేదప్రియు.. 6,000 కంటే ఎక్కువ పాములను పట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు మహిళలు ఎవరూ ఆసక్తి చూపని రంగంలో ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వేదప్రియ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈమెకు సంబంధించిన వార్తలు (Viral news) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వేదప్రియ గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Funny Video: ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న ప్రియుడు.. అటుగా వెళ్తూ చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

Updated Date - 2023-11-23T18:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising