ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ బుడ్డోడికి అసలు భయమే లేదా..? అంతటి గాలి దుమ్ములోనూ ఈ పిల్లాడు చేస్తున్న పనేంటో చూసి నెటిజన్లు ఫిదా..!

ABN, First Publish Date - 2023-05-19T11:43:37+05:30

ప్రస్తుతం నెట్టింట ఓ బుడ్డోడి వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: ప్రస్తుతం నెట్టింట ఓ బుడ్డోడి వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఓ వైపు గాలి దుమారం రేగుతున్న మనోడు ఏ మాత్రం భయపడకుండా తన తల్లికి (Mother) తనకు చేతనైన సాయం చేయడం వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్‌ అవుతున్నారు. తల్లికొడుకుల బంధం ఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతున్నారు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. వర్షం, గాలి దుమారం వల్ల తల్లి నడుపుతున్న కొట్టుపై ఉంచిన కవర్ ఎగిరిపోతుంటే.. అక్కడే ఉన్నా ఆమె కొడుకు ఆ కవర్‌ను పట్టుకుని కిందికి లాగడం మనం చూడొచ్చు. తాను చిన్న పిల్లోడినని భయపడకుండా అంత పెద్ద గాలి దుమారంలోనూ ఆ కవర్‌ను కిందికి లాగడం చేశాడు. అంతలోనే షాపు ముందు ఉన్న ఒక కూర్చి.. ఆ గాలి దుమారానికి కొట్టుకుపోవడం గమనించాడు. దాంతో కవర్‌ను వదిలిపెట్టి చైర్ కోసం పరుగులు పెట్టాడు. ఒకవైపు గాలి దుమారం.. మరోవైపు వర్షం అయినా ఎలాగోలా కూర్చిని దొరకబట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని తీసుకువచ్చి షాపులో పెట్టాడు. దీన్నంతటిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.

Viral Video: భర్త, పిల్లలకు భోజనం పెట్టేందుకు ఓ భార్య వింత కండీషన్.. ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి రూల్‌ను పాటిస్తే..!


ఆ వీడియోను అజయ్ రాజ్ (@Ajayraj___420) అనే ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి 'ఓ చిన్న పిల్లాడు తన తండ్రి షాపును గాలి దుమారం నుంచి కాపాడుతున్నాడు. ఓ కుమారుడిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు' అనే క్యాప్షన్ జత చేశాడు. అంతే.. సోషల్ మీడియాలో వీడియో కాస్తా వైరల్ అయింది. ఇప్పటివరకు వీడియోకు 1.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 52వేల వరకు లైక్స్ వచ్చిపడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'బుడ్డోడే గానీ, గట్టోడే' అని ఒకరు, 'అప్పుడే కుమారుడిగా తన బాధ్యత నిర్వర్తించడం మొదలెట్టాడుగా.. బుద్దిమంతుడే' అని మరోకరు, ఇలా ఆ బుడ్డోడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎమోషనల్‌ కామెంట్ చేస్తున్నారు.

Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-05-19T11:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising