ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: పోలీసుల వద్దకు ఏడుస్తూ వచ్చిన 7 ఏళ్ల పిల్లాడు.. ఏమైందని అడిగితే ఆ బాలుడు చెప్పింది విని షాక్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-10-25T19:46:34+05:30

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలు కూడా పెద్దల తరహాలో చిన్న చిన్న సమస్యలకు పెద్ద నిర్ణయాలు తీసుకుని చివరకు చిక్కుల్లో పడడం చూస్తూ ఉన్నాం. పరీక్షలో ఫెయిల్ అయ్యామని కొందరు, టీచర్ తిట్టాడని మరికొందరు, పాఠశాలకు వెళ్లే ఇష్టం లేక ఇంకొందరు.. చివరకు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలు కూడా పెద్దల తరహాలో చిన్న చిన్న సమస్యలకు పెద్ద నిర్ణయాలు తీసుకుని చివరకు చిక్కుల్లో పడడం చూస్తూ ఉన్నాం. పరీక్షలో ఫెయిల్ అయ్యామని కొందరు, టీచర్ తిట్టాడని మరికొందరు, పాఠశాలకు వెళ్లే ఇష్టం లేక ఇంకొందరు.. చివరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏడేళ్ల పిల్లాడు ఏడుస్తూ పోలీసుల వద్దకు వెళ్లాడు. ఏమైందని అడిగితే.. ఆ బాలుడు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. చివరకు ఏం తెలిసిందంటే..

తూర్పు చైనాలోని (East China) జెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఏడేళ్ల పిల్లాడు పోలీసులనే తప్పుదారి పట్టించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు బాలుడు ఓ రోజు తన పాఠశాల టీచర్ ఇచ్చిన హోంవర్క్ (School homework) పూర్తి చేయలేదు. దీంతో మరుసటి రోజు స్కూల్‌కి వెళ్తే.. టీచర్లు మందలిస్తారనే భయంతో ఇంటి నుంచి వెళ్లాడు కానీ.. పాఠశాలకు వెళ్లలేదు. స్కూల్‌కు వెళ్లకుండా (boy left home) పారిపోయి మరో తప్పు చేసిన బాలుడు.. తనకు ఎలాంటి సమస్యా రాకుండా ఉండేందుకు వెరైటీ ప్లాన్ వేశాడు.

Shocking: శాస్త్రవేత్తలనే అవాక్కయ్యేలా చేస్తున్న వింత జీవి.. ఇది మత్స్యకన్యనా..? లేక మమ్మీనా..?

తర్వాత ఏడుస్తూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ‘‘మా నాన్న రోజూ నన్ను కొడుతున్నాడు సర్’’.. అంటూ పోలీసుల ముందు బోరున ఏడ్చాడు. పిల్లాడి బాధ చూసి పోలీసులు కూడా అయ్యో పాపం! అంటూ సానుభూతి చూపించారు. చివరకు అతడి తండ్రిని స్టేషన్‌కి పిలిపించి విచారించారు. అయితే తాను తన కొడుకును ఏమీ అనలేదని తండ్రి చెప్పాడు. దీంతో పోలీసులకు అనుమానం కలిగి పిల్లాడిని ఓ గదిలోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా విచారించారు. దీంతో చివరకు అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తర్వాత బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. కాగా, ఈ వార్త చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral: ఈ ఊరిని అమ్మేస్తున్నారట.. కళ్లు చెదిరే ధర ఉంటుందనుకుంటే పొరపాటే.. ఈ గ్రామం మొత్తాన్ని ఎంతకు కొనుక్కోవచ్చంటే..!

Updated Date - 2023-10-25T19:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising