ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heartwarming Video: దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు..!

ABN, First Publish Date - 2023-08-10T12:47:10+05:30

ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం హృదయాన్ని కదిలించేవిగా (Heartwarming) ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఉన్నట్టుండి పనిచేయని లిఫ్ట్ తాలూకు వీడియో అది.

Heartwarming Video: ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం హృదయాన్ని కదిలించేవిగా (Heartwarming) ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఉన్నట్టుండి పనిచేయని లిఫ్ట్ తాలూకు వీడియో అది. చంటిబిడ్డతో ఉన్న ఓ మహిళతో పాటు కొరియర్ బాయ్‌ను కొద్దిసేపు ఆ లిప్ట్‌ భయపడేలా చేసింది. కానీ, కొరియర్ బాయ్ సమయస్ఫూర్తితో వారు సురక్షితంగా బయటపడ్డారు. గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ (goodnews movement) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. మొదట చంటిబిడ్డతో ఓ మహిళ లిఫ్ట్ ఎక్కింది. ఆ తర్వాత కొరియర్ బాయ్ కూడా అదే లిఫ్ట్‌లోకి వచ్చాడు. కానీ, ఉన్నట్టుండి లిఫ్ట్ పనిచేయలేదు (Malfunctioning Lift). అప్పటికే డోర్లు ముసుకుపోవడంతో పాటు కుదుపులకు లోనైంది. దాంతో ఆ లిఫ్ట్ లోపల బేబితో ఉన్న మహిళ భయపడి మూలకు వెళ్లి నిల్చుంది. అది గమనించిన పక్కనే ఉన్న కొరియర్ బాయ్ (Courier Boy) కుదుపులకు ఆ తల్లిబిడ్డ కిందపడిపోకుండా వారిని తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో డోర్లు తెరిచేందుకు కూడా ప్రయత్నించాడు.

Mega Millions: లక్​ అంటే నీదే బాసూ.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!


చివరికి డోర్లు తెరుచుకోవడంతో ఆ ముగ్గురు లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇక చంటిబిడ్డతో లిఫ్ట్‌లో ఉన్న మహిళను కొరియర్ బాయ్ భయపడకుండా చేసి, వారిని కిందపడకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు' అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు కొరియర్ బాయ్ రియల్ హీరో అని కూడా ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

Viral Video: ఓరి నాయనో.. ఇదేం కొట్టుకోవడంరా బాబు.. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా ఇలాంటి ఫైట్ ఉండదేమో..!

Updated Date - 2023-08-10T12:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising