ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Newly Married Woman: మామిడిపండ్లను తిన్న వెంటనే మరణించిన కొత్త కోడలు.. వాటినే తిన్న అత్త మాత్రం సేఫ్..!

ABN, First Publish Date - 2023-07-15T19:17:28+05:30

ఆ దంపతులకు వివాహమై రెండేళ్లు కూడా కాకుండానే ఆ ఇంట విషాదం నెలకొంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారాన్ని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో గానీ.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అత్తతో కలిసి మామిడి పండ్లు తినడమే ఆమె పాటిట శాపమైంది. అవి తిన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దంపతులకు వివాహమై రెండేళ్లు కూడా కాకుండానే ఆ ఇంట విషాదం నెలకొంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారాన్ని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో గానీ.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అత్తతో కలిసి మామిడి పండ్లు తినడమే ఆమె పాటిట శాపమైంది. అవి తిన్న కాసేపటికే కోడలు మృతి చెందింది. అయితే అదే మామిడి పండ్లను తిన్న అత్తగానికి మాత్రం ఏమీ కాలేదు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి బిజల్‌పూర్‌కు చెందిన అర్చన (23)కు ఏడాదిన్నర క్రితం ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అర్చనకు తన భర్తతో ఎలాంటి గొడవలూ లేవు. దీంతో ఇన్నాళ్లూ ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవించారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల వీరి ఇంట్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు ఊర్లోకి మామిడి పండ్లు రావడంతో అర్చన కుటుంబ సభ్యులు కూడా తీసుకున్నారు. అర్చన, తన అత్త కలిసి (Mother-in-law and daughter-in-law ate mangoes) నాలుగు మామిడి పండ్లను తిన్నారు. అయితే అత్తగారికి ఎమీ కాకున్నా.. కోడలు మాత్రం మామిడి పండ్లు తిన్న కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురైంది.

Unique Divorce: పెళ్లయిందన్న ఆనందంలో ఉన్న వధువుకు.. భారీ షాకిచ్చిన వరుడు.. రెండు గంటలకే విడాకులిచ్చేశాడు..!

దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్చన మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు తినడం వల్లే మహిళ మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అవే మామిడి పండ్లను అత్త తిన్నాకూడా ఏమీ కాకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. విచారణ చేస్తున్నామని, అనంతరం కారకులపై కఠన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మహిళ మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..

Updated Date - 2023-07-15T19:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising