Marriage: పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ వరుడు ఇలా చేశాడేంటి..? వధువుకు అసలు విషయం తెలిసి..!
ABN, First Publish Date - 2023-11-28T20:50:10+05:30
పెళ్లికి ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మరోవైపు అతిథులంతా గ్రామానికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు వివాహం జరగాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉదయం...
పెళ్లికి ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మరోవైపు అతిథులంతా గ్రామానికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు వివాహం జరగాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉదయం గ్రామస్తులు ఊరి బయటికి వెళ్లగా.. పొలాల్లో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ జిల్లా భితర్‌బార్ పోలీస్ స్టేషన్ పరిధి డోంగర్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడికి, ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో రెండు కుటుంబాల వారూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం గ్రామస్తులు కూలి పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్లారు. అయితే అక్కడ వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.
మంగళవారం వివాహం చేసుకోవాల్సిన వరుడు.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య (Groom committed suicide) చేసుకున్నాడు. గ్రామస్తులు వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు.. ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయం తెలిసి వధువు బోరున విలపించింది. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Homemade Geyser: వేలకు వేలు పెట్టి గీజర్లు కొనలేక.. ఇంట్లోనే ఎలా తయారు చేశారో మీరే చూడండి..!
Updated Date - 2023-11-28T20:50:15+05:30 IST