ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tip Controversy: ఇంత లగ్జరీ ఇంట్లో ఉంటూ ఇంత చీప్‌గా టిప్ ఇస్తావా..? ఓ డెలివరీ బాయ్ మాటలకు విస్తుపోయిన మహిళ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-07-06T17:51:18+05:30

ప్రస్తుతం ఎవరికి ఏది కావాలన్నా ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి చివరకు ఆహార పదార్థాలను సైతం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తుంటారు. మరోవైపు డెలివరీ బాయ్‌లు కూడా ఆర్డర్లను సరైన సమయానికి ఇళ్లకు చేర్చడంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఎవరికి ఏది కావాలన్నా ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి చివరకు ఆహార పదార్థాలను సైతం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తుంటారు. మరోవైపు డెలివరీ బాయ్‌లు కూడా ఆర్డర్లను సరైన సమయానికి ఇళ్లకు చేర్చడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. యూఎస్‌లో ఓ డెలివరీ బాయ్ నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రూ.1200 విలువైన ఆర్డర్‌కు.. ఓ మహిళ ఇచ్చిన టిప్‌ను చూసి అతడికి చిర్రెత్తుకొచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

యూఎస్‌లోని టెక్సాస్‌లో (US Texas) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన లేసీ పర్సివల్ అనే మహిళ (woman) ఇటీవల ఓ రోజు రూ.1200 విలువ చేసే పిజ్జాను (Pizza) ఆర్డర్ చేసింది. గంటల వ్యవధిలో డెలివరీ బాయ్ (Delivery boy) .. వచ్చి ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. పిజ్జాను మహిళకు అందజేసి వెళ్లిపోతాడు. ఇంతవరకూ ఎలాంటి సమస్య లేకున్నా.. సదరు మహిళ ఇచ్చిన టిప్‌ (Tip) వల్లే అసలు సమస్య వచ్చి పడింది. రూ.1200 విలువ చేసే ఆర్డర్‌కు సుమారు రూ.300 వరకూ టిప్ ఇచ్చింది. దీంతో డెలివరీ బాయ్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఇంత ఖరీదు చేసే ఇంట్లో ఉంటూ.. మరీ ఇంత తక్కువ టిప్ ఇస్తావా అంటూ మండిపడ్డాడు.

Viral News: ఈ మహిళకు వింత కష్టం.. కనీసం బాత్రూంలు కడిగే ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదట.. అసలు కారణమేంటంటే..!

డెలివరీ బాయ్ అక్కడి నుంచి విసుక్కుంటూనే బయటికి వెళ్లిపోయాడు. తనకు ఎవరైన అనుభవాన్ని వివరిస్తూ సదరు మహిళ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసింది. ‘‘రూ.1,200 ఖరీదు చేసే పిజ్జాకు ఎంత టిప్ చెల్లించాలి’’.. అని వ్యాఖ్యానిస్తూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డెలివరీ బాయ్ చేసింది తప్పు’’.. అంటూ కొందరు, ‘‘మరికొంత ఎక్కువ టిప్ ఇవ్వాల్సింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇచ్చింది సంతోషంగా తీసుకోవాలే గానీ.. ఇలా విమర్శించడం తగదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‪‌ను సొంతం చేసుకుంది.

Viral News: ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి.. మొదటి రోజే ఊహించని షాకిచ్చిన యజమాని.. ఆయన తెచ్చింది చూసి..!

Updated Date - 2023-07-06T17:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising