ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fridge-Milk: ఫ్రిడ్జ్‌లో పాలను ఎక్కడ ఉంచుతున్నారు..? తెలియక అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!

ABN, First Publish Date - 2023-08-04T16:34:28+05:30

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చాలా మంది కూరగాయలు మొదలుకుని ఉప్పు నుంచి పప్పు వరకూ మొత్తం అందులోనే కుక్కేస్తుంటారు. ఏ వస్తువైనా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఎక్కువ మంది భ్రమ పడుతుంటారు. కానీ కొన్నిసార్లు తెలీక చేసే పొరపాట్ల కారణంగా..

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చాలా మంది కూరగాయలు మొదలుకుని ఉప్పు నుంచి పప్పు వరకూ మొత్తం అందులోనే కుక్కేస్తుంటారు. ఏ వస్తువైనా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఎక్కువ మంది భ్రమ పడుతుంటారు. కానీ కొన్నిసార్లు తెలీక చేసే పొరపాట్ల కారణంగా అందులో ఉంచిన వస్తువులు కూడా త్వరగా పాడవుతుంటాయి. ప్రధానంగా పాల ప్యాకెట్ల విషయంలో ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. పాలను ప్రిడ్జ్‌లో ఎక్కడ స్టోర్ చేయాలి.. అనే విషయం తెలీక.. ఎంతో మంది బిగ్ మిస్టేక్ చేస్తుంటారు. అసలు పాలను ఫ్రిడ్జ్‌లో ఏ ప్రాంతంలో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో తెలుసుకుందాం..

ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ (fridge) కామన్ అయిపోయింది. దీంతో పాలు, పెరుగు, ఉప్పు, పప్పు ఇలా ప్రతి ఒక్కటీ పాడవకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. ఉదయం పాల ప్యాకెట్లు తెచ్చుకోగానే.. అవసరమైనంత వాడుకుని మిగిలిన పాలను ఫ్రిడ్జ్‌లో ఉంచుతుంటారు. ఇలా మరుసటి రోజు కూడా వాటిని వాడుకుంటుంటారు. అయితే ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తుంటారు. సాధారణంగా ఎవరైనా ఫ్రిడ్జ్ డోరు తెరిచి పక్కనే ఉన్న అరల్లో పెట్టేస్తుంటారు. కానీ ఇలా ఉంచడం వల్ల పాలు (milk) ఎక్కువ సమయం నిల్వ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే చీటికీ మాటికీ ఫ్రిడ్జ్ డోరు తెరుస్తుంటాము కాబట్టి.. లోపలి చల్ల గాలి బయటికి వెళ్లిపోతుంది. చల్లదనంలో హెచ్చతగ్గుల కారణంగా పాలల్లో బ్యాక్టీరియా చేరుతుంది. తద్వారా త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పాలను బయట నిల్వ చేస్తే.. కేవలం 8గంటల పాటు మాత్రమే తాజాగా ఉంటాయి.

Shocking: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో భర్త.. మెడికల్ టెస్టులు చేసి.. భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

ఇక వేసవిలో అయితే గంటల వ్యవధిలోనే పాలు చెడిపోతుంటాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. 32 డిగ్రీల ఫారెన్‌హీట్ నుంచి 39.2 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో భద్రపరుచుకోవాలి. ఇందుకోసం ఫ్రిడ్జ్ షెల్ఫ్ దిగువన లోపలి భాగంలో ఉంచుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ లేని వారు పాలు ఎక్కువ సమయం పాడవకుండా ఉండేందుకు.. వేడి చేసే సమయంలో చిటికెడు బేకింగ్ సోడా జోడించాలి. తర్వాత చిన్న మంట మీద బాగా మరిగించాలి. అనంతం వాటిని ఇంట్లోని చల్లటి ప్రదేశంలో మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల 24గంటల పాటు చెడిపోకుండా ఉంటాయి. అయితే, ఫ్రిడ్జ్‌లో అయినా.. బయట అయినా పాలను ఒక రోజు కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

Bride: రైల్లో ఓ కొత్త జంట జర్నీ.. బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్.. రైలంతా వెతికితే..!

Updated Date - 2023-08-04T16:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising