12 మంది శిశువులు కడుపులో ఉంటే.. 6 గంటల పాటు కష్టపడి అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులే నివ్వెరపోయారు..!
ABN, First Publish Date - 2023-02-24T20:21:41+05:30
ఓ మహిళకు దేశంలోనే చాలా అరుదుగా వచ్చే అనారోగ్య సమస్య వచ్చింది. ఒకరు, ఇద్దరు కాదు.. 12మంది శిశువులు కడుపులో ఉంటే ఎలా ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా.. అంత మంది..
ఓ మహిళకు దేశంలోనే చాలా అరుదుగా వచ్చే అనారోగ్య సమస్య వచ్చింది. ఒకరు, ఇద్దరు కాదు.. 12మంది శిశువులు కడుపులో ఉంటే ఎలా ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా.. అంత మంది శిశువులు కాకున్నా, అంత బరువున్న గడ్డతో మహిళ ఇబ్బంది పడుతోంది. కడుపు నొప్పితో పాటూ నడవడం కూడా కష్టంగా మారడంతో చివరకు పెద్దాసుపత్రికి వెళ్లింది. 6 గంటల పాటు కష్టపడి అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులే.. ఆమె పరిస్థితి చూసి నివ్వెరపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని మహామన పండిట్ మదన్ మోహన్ మాల్వియా కేన్సర్ సెంటర్, హోమీ భాభా క్యాన్సర్ (Mahamana Pandit Madan Mohan Malaviya Cancer Centre) సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ 55ఏళ్ల మహిళ (55 years old woman).. పొత్తి కడుపు విస్తరించడంతో పాటూ విపరీతమైన నొప్పి ఉండడంతో సదరు ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు.. కడుపులో భారీ కణితిని (massive tumor) గుర్తించారు. చివరకు ఆమెకు ఆపరేషన్ అవసరమని గుర్తించారు. గురువారం సుమారు 6గంటల పాటు శ్రమించి విజయవంతంగా (operation successful) ఆపరేషన్ పూర్తి చేశారు. ఆమె కడుపులో 30.5కిలోల కణితి ఉండడం చూసి వైద్యులు కూడా నివ్వెరపోయారు.
ఈ కణితి సుమారు 12మంది నవజాత శిశువుల (Newborn babies) బరువుతో సమానమని డాక్టర్లు చెప్పారు. సదరు మహిళ రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా (Retroperitoneal liposarcoma) సమస్యతో బాధపడుతోందని తెలిపారు. ఇది ఓ అరుదైన కేన్సర్ అని చెప్పారు. కణితి పరిమాణం పెద్దదిగా ఉండడంతో పాటూ కడుపులోని ప్రధాన రక్త నాళాల వద్ద ఉండడంతో ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందన్నారు. 30.5కిలోల బరువుతో 64 సెం.మీ. పొడవు, 46 సెం.మీ. వెడల్పు ఉన్న కణితిని కడుపులో నుంచి తొలగించడం దేశంలో మొదటిసారి అని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు లిపోసార్కోమా సమస్యతో పాటూ కిడ్నీ కేన్సర్ (Kidney cancer) కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-02-24T20:21:45+05:30 IST