Shocking Incident: వైద్యులే నివ్వెరపోయిన ఘటన.. అప్పుడే పుట్టిన బాలికకు 6 సెంటీమీటర్ల తోక.. డాక్టర్లు ఏం తేల్చారంటే..
ABN, First Publish Date - 2023-02-21T16:10:22+05:30
అప్పుడప్పుడూ అరుదైన జననాలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పుట్టుకతోనే వింత వింత రూపాలతో జన్మిస్తుంటారు. కొందరు రెండు తలలు, మూడు చేతులతో జన్మిస్తే.. మరికొందరు..
అప్పుడప్పుడూ అరుదైన జననాలకు (Rare births) సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పుట్టుకతోనే వింత వింత రూపాలతో జన్మిస్తుంటారు. కొందరు రెండు తలలు, మూడు చేతులతో జన్మిస్తే.. మరికొందరు నాలుగు కాళ్లు నాలుగు చేతులతో జన్మిస్తుంటారు. ఇంకొందరైతే శరీరం మొత్తం వెంట్రుకలతో జన్మిస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్రెజిల్లో ఇలాంటి అరుదైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన బాలిక 6 సెంటీమీటర్ల తోక ఉండడం చూసి వైద్యులే నివ్వెరపోయారు. చివరకు వారు ఏం తేల్చారంటే..
బ్రెజిల్లో ఈ ఘటన (Brazil viral news) చోటు చేసుకుంది. ఓ గర్భిణి పురుటినొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆపరేషన్ చేసిన వైద్యులు చివరకు జన్మించిన బాలికను చూసి నివ్వెరపోయారు. బాలిక సుమారు 6 సెంటమీటర్ల తోకతో జన్మించడం (girl born with a tail) అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరకు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని వైద్యులు తెలిపారు.
శిశువు వెన్నెముక సరిగ్గా అభివృద్ధి చెందలేదని, దీని వల్లే ఇలా జరిగిందని చెప్పారు. బ్రెజిల్ 2021 ప్రారంభంలో ఇలాంటి శిశువే జన్మించింది. అప్పట్లో ఓ శిశువు సుమారు 12సెంటీమీటర్ల తోకతో జన్మించిందని వైద్యులు గుర్తు చేశారు. కాగా, ఆరు సెంటీమీటర్ల తోకతో జన్మించిన శిశువుకు సంబంధించిన ఫొటోలు (Viral photos).. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-02-21T16:10:27+05:30 IST