Eggs: ఉడికించిన గుడ్లను వాసన చూసి వదిలేసిన పెంపుడు కుక్క.. అనుమానంతో ఆ యజమాని గుడ్లను కట్ చేసి చూస్తే..!
ABN, First Publish Date - 2023-06-10T20:05:54+05:30
చాలా మంది తమ పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. ఇక ఆహారం విషయంలో ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వృద్దుడు కూడా తన కుక్కను అలాగే చూసుకునేవాడు. రోజూ మంచి మంచి ఆహారంతో పాటూ గుడ్లు తీసుకొచ్చి పెట్టేవాడు. అయితే...
చాలా మంది తమ పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. ఇక ఆహారం విషయంలో ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వృద్ధుడు కూడా తన కుక్కను అలాగే చూసుకునేవాడు. రోజూ మంచి మంచి ఆహారంతో పాటూ గుడ్లు తీసుకొచ్చి పెట్టేవాడు. అయితే ఇటీవల ఓ రోజు ఉడికించిన గుడ్లను పెట్టడంతో కుక్క కేవలం వాసన చూసి వదిలేసింది. దీంతో అనుమానం వచ్చిన అతను చివరకు వాటిని కట్ చేసి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధి మోదీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న అశోక్ అనే వృద్ధుడు (old man) ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి రోజూ మంచి మంచి ఆహారం పెడుతూ ప్రేమగా చూసుకునేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు సమీపంలోని దుకాణంలో కొన్ని గుడ్లను (Eggs) కొనుక్కుని వచ్చాడు. వాటిని ఉడికించిన తర్వాత కొన్నింటిని కుక్కకు పెట్టాడు. అయితే గుడ్లను వాసన చూసిన కుక్క (dog) .. తినకుండానే వెళ్లిపోయింది. రోజూ గుడ్లు తినే కుక్క.. ఈసారి మాత్రం తినకపోవడంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. గుడ్డును పగులగొట్టి లోపల చూడగా.. సొన మొత్తం ప్లాస్టిక్ (Plastic egg) మయంగా ఉండడంతో షాక్ అయ్యాడు.
ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు.. ఇలా ఇటీవల పుకార్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలా ప్లాస్టిక్ గుడ్డును ప్రత్యక్షంగా చూసి షాక్ అయ్యాడు. వెంటనే వాటిని ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఘజియాబాద్‌లో ప్లాస్టిక్, రసాయనాల ద్వారా గుడ్లు తయారు చేస్తున్నారనే వార్తలు ఇప్పటికే షికారు చేస్తున్నాయి. దీంతో ప్లాస్టిక్ గుడ్ల ఫొటోలు (Viral photos) తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం సంబంధిత అధికారుల వరకూ వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అయితే దీనిపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇకపై గుడ్డు తినాలంటేనే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘నకిలీ గుడ్లను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-06-10T20:09:54+05:30 IST