ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake vs Dogs: శునకాల రాజ్యంలోకి పాము ఎంట్రీ.. బుసలు కొట్టి బెదిరించినా కుక్క పిల్లలూ భయపడలేదు.. చివరకు..!

ABN, First Publish Date - 2023-07-07T18:50:44+05:30

చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ అన్నట్లు.. అనవసరంగా కెలికితే కొన్నిసార్లు పిల్లి కూడా పులి అవుతుంది. దాడి చేయాలని పోయి.. చివరకు తోక ముడిచి పారిపోయిన పులులు, సింహాలను చూశాం. మరికొన్ని సార్లు వాటి చేతిలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ అన్నట్లు.. అనవసరంగా కెలికితే కొన్నిసార్లు పిల్లి కూడా పులి అవుతుంది. దాడి చేయాలని పోయి.. చివరకు తోక ముడిచి పారిపోయిన పులులు, సింహాలను చూశాం. మరికొన్ని సార్లు వాటి చేతిలోనే ప్రాణాలు వదిలిన క్రూర జంతువులను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కుక్కలు, పాముకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శునకాల రాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన పాము.. కుక్క పిల్లలను కాటేయాలని చూసింది. చివరకు ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కుక్కలు (dogs) తమ పిల్లలతో కలిసి చెట్టు నీడన సేదతీరుతూ ఉంటాయి. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు పొదల్లో నుంచి ఓ పాము (snake) అక్కడికి వస్తుంది. కుక్క పిల్లలను కాటేయాలని చూస్తుంది. అక్కడే ఉన్న పెద్ద కుక్క దాన్ని గమనించి, నోటితో పట్టుకుని నేలకేసి కొడుతుంది. దీంతో అక్కడి నుంచి పారిపోతున్న పామును వెంబడించి మరీ పట్టుకున్న కుక్క.. మళ్లీ నోటితో పట్టుకుని వచ్చి విసిరికొడుతుంది. పక్కనే ఉన్న రెండు కుక్కలు కూడా (Dog attack on snake) పాము పైకి దాడికి దిగుతాయి. దాని కాటు నుంచి తప్పించుకుంటూ తోక పట్టుకుని విసిరికొడుతుంటాయి.

Viral Video: ఆ డ్రైవర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకే ఒక్క క్షణంలో ఎంత ప్రమాదం తప్పిందో మీరే చూడండి..!

ఈ క్రమంలో పాము కుక్క పిల్లలను కాటు వేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో కుక్కలకు చిర్రెత్తుకొచ్చి చివరగా నొటితో గట్టిగా పట్టుకుని విదిలించి కొడతాయి. ఈ దాడిలో చివరకు పాము ప్రాణాలు కోల్పోతుంది. చనిపోయిందని నిర్ధారించుకునే వరకూ మూడు కుక్కలు కలిసి పాముపై దాడి చేస్తూనే ఉంటాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లలను రక్షించుకునేందుకు కుక్కలు చేసిన సాహసం సూపర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీ భార్య కంటే నేనే బెటర్‌.. అంటూ లిఫ్ట్‌లోనే ఓ మహిళ రచ్చ.. నా భార్య గర్భవతి అంటూ అతడు అడిగిన ఒక్క మాటకే..!

Updated Date - 2023-07-07T18:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising