Crime News: మా పక్కింట్లోంచి విపరీతంగా దుర్వాసన వస్తోంది.. తాళం వేసి ఉందంటూ పోలీసులకు వచ్చిందో ఫోన్.. వెళ్లి చూస్తే..!
ABN, First Publish Date - 2023-05-20T17:16:31+05:30
క్షణికావేశంలో దారుణాలకు పాల్పడే వారు.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మరిన్ని నేరాలకు పాల్పడుతుంటారు. కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు కూడా చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి..
క్షణికావేశంలో దారుణాలకు పాల్పడే వారు.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మరిన్ని నేరాలకు పాల్పడుతుంటారు. కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు కూడా చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో పక్కింటి వారు పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్ధలు కొట్టి చూడగా లోపల షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
ఒడిశా (Odisha) బోలంగీర్ పరిధి సాలేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన శంకర్ అనే వ్యక్తి.. తండ్రి, సోదరుడు రింకూతో కలిసి ఉంటున్నాడు. శంకర్ బయట వివిధ పనులు చేస్తూ కుటంబ బాధ్యతలన్నీ తానే చూసుకునేవాడు. అయితే ఇటీవల ఇతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంట్లో తరచూ గొడవలు (quarrels) పడుతూ ఉండేవాడు. సోదరుడు రింకూతో కూడా గొడవ పడేవాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ రింకూ తన తండ్రితో గొడవపడి దాడి చేశాడు. దీంతో చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలసుకున్న శంకర్.. మరింత ఆగ్రహానికి గురయ్యాడు. మే 14న ఇంటికి వచ్చిన శంకర్.. రాత్రి సోదరుడితో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై రింకూపై గొడ్డలితో (Assault on brother) దాడి చేశాడు. ఈ దాడిలో రింకూ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని బయట పారేయలేక.. ముక్కలుగా నరికి సంచిలో భద్రపరిచాడు. మరుసటి రోజు తలుపులు మూసి పరారయ్యాడు. వారి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. తలుపులు మూసి ఉండడంతో చివరకు 17న పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగులగొట్టి సంచిలో నింపిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుటసి రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Updated Date - 2023-05-20T17:16:31+05:30 IST