ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cigarettes: పొగరాయుళ్లూ.. ఈ విషయం తెలుసా?.. సిగరెట్ రేట్లు ఎంత పెరుగుతాయంటే..

ABN, First Publish Date - 2023-02-02T22:03:20+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 (Union Budget2023) పొగరాయుళ్లను (Smokers) ఒకింత టెన్షన్‌కు గురిచేసింది. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 (Union Budget2023) పొగరాయుళ్లను (Smokers) ఒకింత టెన్షన్‌కు గురిచేసింది. సిగరెట్లపై జాతీయ విపత్తు ఆగంతుక డ్యూటీని (NCCD) ఏకంగా 16 శాతం పెంచుతున్నట్టు ప్రతిపాదించడమే ఇందుకు కారణమైంది. ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్ రేట్లు ఎంత పెరుగుతాయో ఏమోనని కలవరానికి గురయ్యారు. బడ్జెట్ నేపథ్యంలో ట్విటర్‌తోపాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో సిగరెట్ ట్రెండ్‌లో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చారు. అయితే ఎక్సైజ్ డ్యూటీ పెంపు పట్ల ధూమపాన ప్రియులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనతో సిగరెట్ రేట్లపై ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. సిగరెట్ కేటగిరీలను బట్టి ఒక్కో స్టిక్‌పై 7-12 పైసలు వరకు పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నారు. రేట్లు పెద్దగా పెరగబోవంటున్నారు. కంపెనీలపై కూడా చెప్పుకోదగ్గ ప్రభావం ఉండబోదని, లాభాలపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోదని విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్‌సీసీడీని (NCCD) చివరిసారిగా మూడేళ్లక్రితం సవరించారు. అప్పుడు కూడా 16 శాతమే పెంచామని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.

సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు తయారీ కంపెనీల లాభాలపై పెద్దగా ప్రభావం చూపించబోదని క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ‘క్రిసిల్ రేటింగ్స్’ డైరెక్టర్ ఆనంద్ కుల్‌కర్ణి విశ్లేషించారు. సెస్ 15 - 16 శాతం పెంపు ఫలితంగా సైజు, ఫిల్టర్ ఆధారంగా ఒక్కో స్టిక్‌‌పై 7 - 12 పైసలు మాత్రమే పెరుగుతుందన్నారు. ఈ ప్రభావంతో కంపెనీల లాభాలు కేవలం 1 శాతం లోపేనని పేర్కొన్నారు. మొత్తంగా సెస్ పెంపు ప్రభావం ఏమాత్రం ఉండబోదని నువమా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభ్నీష్ రాయ్ చెప్పారు. ట్యాక్స్ పెంపు తమ అంచనాల కంటే తక్కువగానే ఉందని, కాబట్టి ఐటీసీ సహా ఇతర సిగరెట్ తయారీ కంపెనీలపై ప్రభావం ఉండబోదన్నారు. కంపెనీలు 1 - 2 శాతం మాత్రమే రేట్లు పెంచుతాయని విశ్లేషించారు.

పెరుగుదల ఇలా ఉండొచ్చు!

ఫిల్టర్ సిగరెట్ల పొడవు 70 ఎంఎం కంటే ఎక్కువ.. 75 ఎంఎం మించని 1000 సిగరెట్ల రేటు రూ.545 నుంచి రూ.630 పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషించారు. పొడవు 65 ఎంఎం కంటే ఎక్కువ.. 70 ఎంఎం మించని 1000 సిగరెట్ల రేటు రూ.440 నుంచి రూ.510కు పెరుగుతుంది. ఇక నాన్-ఫిల్టర్ సిగరెట్ల పొడవు 65 ఎంఎం మించని 1000 సిగరెట్ల రేటు రూ.200 నుంచి రూ.230 పెరగొచ్చు. 65 - 70 ఎంఎం మించని 1000 సిగరెట్ల రేటు రూ.250 నుంచి రూ.290 వరకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-02-02T22:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising