Fridge: మామిడి పండ్లను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా..? తినే ముందు ఈ ఒక్క పని చేయడం మాత్రం మర్చిపోకండి..!
ABN, First Publish Date - 2023-04-18T17:45:29+05:30
సమ్మర్ సీజన్‌లో దొరికే ఎంతో రుచికరమైన పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. పిల్లల దగ్గర నుంచీ పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మ్యాంగోనే. అంతగా ఈ పండును ఇష్టపడుతుంటారు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎంత ఖరీదైనా కొనుక్కుని మరీ తింటుంటారు. కానీ
సమ్మర్ సీజన్‌లో దొరికే ఎంతో రుచికరమైన పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. పిల్లల దగ్గర నుంచీ పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మ్యాంగోనే. అంతగా ఈ పండును ఇష్టపడుతుంటారు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎంత ఖరీదైనా కొనుక్కుని మరీ తింటుంటారు. కానీ ఈ పండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వేసవి (Summer) అనగానే గుర్తుకొచ్చేవి మామిడి పండ్లే. ఈ సీజన్‌లో విరివిగా దొరుకుతుంటాయి. ఎక్కడ పడితే అక్కడా బండ్ల మీద పెట్టి మామిడి పండ్లు అమ్ముతుంటారు. కాకపోతే మాటిమాటికీ బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడి చాలా మంది ఒకేసారి ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిజ్ (Fridge)లో పెడుతుంటారు. కానీ ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు.
మామిడి పండ్లు తిన్న తర్వాత చాలా మందికి చర్మంపై మొటిమలు వస్తుంటాయి. కారణం ఏంటంటే శరీరంలో వేడి పెరిగి ఈ విధంగా వస్తుంటాయి. అందుకోసమే మామిడి పండ్లను కాసేపు నీళ్లలో నానబెట్టి తింటే ఈ సమస్యను నివారించుకోవచ్చు. అంతే కాదు ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే తినకుండా నీటిలో కొద్ది సేపు నాన బెట్టి తింటే అది కూలింగ్ తగ్గి వేడి చేయకుండా ఉంటుంది.
ఇక మామిడి పండ్లు (mangoes) తరచుగా తినడం వల్ల కూడా శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది థర్మోజెనిసిస్‌కు కారణమవుతుంది. మామిడికాయలను తినడానికి ముందు 30 నిమిషాలు నానబెట్టడం వల్ల థర్మోజెనిక్ కంటెంట్ తగ్గుతుంది. అంటే మామిడి పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని నీటిలో 30 నిమిషాలు నానబెట్టడం వల్ల ఫైటోకెమికల్స్ తీవ్రత తగ్గుతుంది. ఇది కొవ్వును కూడా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు జింక్, కాల్షియం మరియు ఇతర ఖనిజాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. కాబట్టి మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల అదనపు ఆమ్లం తొలగిపోతుంది. ఈ విధంగా చేస్తే వేడి పొక్కులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇది కూడా చదవండి: Viral News: అమ్మ బాబోయ్.. రూ.1.60 కోట్లను నడిరోడ్డుపై విసిరేశాడు.. కట్టలకొద్దీ డబ్బును బ్యాగుల్లో పెట్టుకుని వచ్చి మరీ..!
ఇది కూడా చదవండి: Crime News: బీచ్‌లో షాకింగ్ సీన్.. ఇసుకలోంచి బయటపడిన ఓ పాప కాలు.. చివరకు తేలిన నిజం ఏంటంటే..!
Updated Date - 2023-04-18T17:45:29+05:30 IST