తండ్రి పోలికలతో పుట్టిన కూతురు.. అంతా బాగుందని మెచ్చుకుంటుంటే.. తల్లి మాత్రం..
ABN, First Publish Date - 2023-03-24T21:06:18+05:30
చాలా కుంటుంబాల్లో భర్తతో పాటూ అత్తమామలు.. వంశోద్ధారకుడు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. పొరపాటున కూతురు పుడితే విపరీతంగా బాధపడిపోతుంటారు. కొందరైతే ఆ కోపాన్నంతా కోడలిపై చూపిస్తుంటారు. ఎవరు ఎంత బాధపడ్డా.. తల్లి ప్రేమలో మాత్రం..
చాలా కుంటుంబాల్లో భర్తతో పాటూ అత్తమామలు.. వంశోద్ధారకుడు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు. పొరపాటున కూతురు పుడితే విపరీతంగా బాధపడిపోతుంటారు. కొందరైతే ఆ కోపాన్నంతా కోడలిపై చూపిస్తుంటారు. ఎవరు ఎంత బాధపడ్డా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. కొడుకు, కూతురును సమానంగా చూసుకుంటుంది. అయితే కొందరు మహిళలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. తాజాగా, మహారాష్ట్రలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. కూతురు పుట్టిందని భర్తతో పాటూ అత్తమామలు సంతోషపడ్డారు. అంతా తండ్రి పోలికలతో పుట్టిందని మెచ్చకుంటుంటే.. తల్లి మాత్రం చివరకు ఏం చేసిందంటే..
మహారాష్ట్ర (Maharashtra) నాసిక్ పరిధి గంగాపూర్ శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న భార్యాభర్తలు (husband and wife) .. సంతానం కోసం పరితపించేవారు. ఇటీవల సదరు మహిళ గర్భం దాల్చింది. దీంతో భర్త, అత్తమామలు ఎంతో సంతోషించారు. వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఇటీవలే కోడలు.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల అయినా అత్తింటి వారు ఎంతో ఆనందపడ్డారు. మహాలక్ష్మి పుట్టిందని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపను చూడటానికి వచ్చిన వారంతా.. ‘‘అచ్చం తండ్రి పోలికలతో పుట్టింది.. ఎంతో బాగుంది’’.. అంటూ మెచ్చుకున్నారు.
Viral Video: రంగులు మార్చే ఈ కప్ప.. పాము కనబడగానే ఏం చేసిందో చూస్తే.. ఖచ్చితంగా షాక్ అవుతారు..
ఈ మాటలతో భర్త కూడా ఎంతో మురిసిపోయాడు. అయితే కూతురు భర్త పోలికలతో పుట్టడం మాత్రం భార్యకు నచ్చలేదు. కూతురు పుట్టినప్పటి నుంచి ఇదే ఆలోచనతో నిత్యం అసంతృప్తితో గడిపేది. చూస్తుండగానే కూతురుకు మూడు నెలల వయసు వచ్చింది. కానీ తల్లి మనసులో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇటీవల తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురవుతూ వచ్చింది. చివరకు ఏ తల్లీ తీసుకోని నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కూతురు గొంతు నులిమి హత్య చేసింది.
Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..
ఉదయం తన కూతురును ఎవరో హత్య చేశారంటూ ఏడుపు మొదలెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే తల్లి చెబుతున్న మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చింది. సీసీ కెమెరాల్లోనూ (CC camera videos) అలాంటి దృశ్యాలు కనిపించలేదు. దీంతో చివరకు ఆమెను అదుపులోకి తీసుకుని లోతుగా నేరం అంగీకరించింది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: ఈమె డాన్స్ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్రా బాబోయ్..
Updated Date - 2023-03-24T21:06:18+05:30 IST