నన్నెందుకు వదిలేసింది.. ఏం చేస్తోంది.. ఇదీ ఓ మాజీ భర్తలో మొదలైన ప్రశ్న.. మాజీ భార్యపై ఎయిర్‌ట్యాగ్‌తో నిఘా.. చివరకు..!
ABN, First Publish Date - 2023-02-27T17:42:53+05:30
నిఘా.. ఇదొక వ్యవస్థ. ప్రభుత్వం నిఘా పెడుతుంది. పోలీసులు నిఘా పెడతారు. అలాగే ఇళ్లు, ఆఫీస్‌ల ముందు సీసీ కెమెరాలతో నిఘా పెట్టుకుంటారు. ఇంత వరకు బాగానే
నిఘా.. ఇదొక వ్యవస్థ. ప్రభుత్వం నిఘా పెడుతుంది. పోలీసులు నిఘా పెడతారు. అలాగే ఇళ్లు, ఆఫీస్‌ల ముందు సీసీ కెమెరాలతో నిఘా పెట్టుకుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఒక ప్రబుద్ధుడు... ఏకంగా అర్ధాంగిపైనే నిఘా పెట్టాడు. అయితే అతగాడు నిఘా కోసం ఎలాంటి పరికరాన్ని ఉపయోగించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
బ్యాగ్‌లు, తాళం చెవి వంటి కొన్ని వస్తువులను గుర్తు పెట్టుకునేందుకు యాపిల్ సంస్థ (Apple company) ఎయిర్ ట్యాగ్‌ను (airtag) రూపొందించింది. అయితే అదే పరికారాన్ని నిఘా కోసం ఉపయోగించాడో వ్యక్తి. ఈ సంఘటన అమెరికాలోని టెన్నెసీలో చోటుచేసుకుంది. కార్లొస్ అట్కిన్ అనే వ్యక్తిని నెల రోజుల కిందట భార్య వదిలేసి వేరుగా ఉంటుంది. దీంతో భార్యకు ఎక్కడికెళ్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. అంతే ఆమె వాహనంలో యాపిల్ ఎయిర్ ట్యాగ్‌ను అమర్చాడు. దీంతో ఆమెను అనుసరించడం మొదలు పట్టాడు. ఓసారి ఆమెను ఓ రెస్టారెంట్ నుంచి ఆమె సోదరి ఇంటి వరకు వెంబడించాడు. ఈ విషయాన్ని సదరు మహిళ గమనించింది. మరో సందర్భంలో సోదరుడితో కలిసి బయటకు వెళ్లిl సమయంలో ఆమె కారుపై గులాబీ పువ్వులు ఉంచాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. అట్కిన్ కుమార్తెకు ఫోన్ చేసి తనను ఫాలో అవ్వొద్దని అతడికి చెప్పాల్సిందిగా హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!
అయినా కూడా అతనిలో మార్పు రాలేదు. బంధువుల ఫోన్ నుంచి ఆమెకు కాల్ చేశాడు. ఈ సంభాషణలో తన కారులో ఎయిర్ ట్యాగ్‌ను గుర్తించినట్లు అట్కిన్‌కు వెల్లడించింది. విషయం బయటపడటంతో తప్పును అంగీకరించాడు. ట్రాక్ చేయడం కోసమే దాన్ని ఉంచినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మోటార్ వాహనాన్ని అక్రమంగా ట్రాక్ చేసిన నేరానికి కేసు నమోదు చేశారు.
అలాగే ఈ సంఘటనపై యాపిల్ కూడా స్పందించింది. ప్రజలు వస్తువులు ఎక్కడ ఉన్నాయో సులువుగా గుర్తించేందుకే ఎయిర్ ట్యాగ్‌ను అభిృవృద్ధిని చేసినట్లు తెలిపింది. అంతేకానీ ప్రజలనో.. ఇతర వస్తువులనో ట్రాక్ చేయడానికి కాదు అని పేర్కొంది. ఈ పరికారాన్ని దుర్వినియోగాన్ని చేయడాన్ని ఖండించింది. నేరపూరిత ఉద్దేశాలతో ఎయిర్ ట్యాగ్ ఉపయోగాన్ని గుర్తించేందుకు పోలీసులతో కలిసి పని చేస్తామని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది.
Updated Date - 2023-02-27T17:42:54+05:30 IST