ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఒకప్పుడు ఆర్మీలో సైనికుడు.. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఎందుకిలా కూరగాయల దుకాణం పెట్టుకోవాల్సి వచ్చిందంటే..!

ABN, First Publish Date - 2023-07-26T22:12:51+05:30

దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సైనికులను ఎంతో మందిని చూశాం. ఇంకొందరు ఆర్మీ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా.. అంతే దేశ భక్తితో, అంతే నిజాయితీతో జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు..

దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సైనికులను ఎంతో మందిని చూశాం. ఇంకొందరు ఆర్మీ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా.. అంతే దేశ భక్తితో, అంతే నిజాయితీతో జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు ఆర్మీలో పని చేసిన ఈయన.. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో కూరగాయల దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఎవరీయన, ఎందుకిలాంటి పరిస్థితి వచ్చింది.. అన్న వివరాలు తెలుసుకుంటే.. ఈ మాజీ సైనికుడికి హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేరు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని (Karnataka) బెల్గాంకు చెందిన శివాజీ పాటిల్ అనే 70ఏళ్ల మాజీ సైనికుడి గురించి చుట్ట పక్కల ప్రాంతాల్లో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈయన ఆర్మీలో (Army) పని చేస్తున్న సమయంలో కార్గిల్ యుద్ధం (Kargil War) జరిగింది. ఆ సమయంలో అధిక చలి కారణంగా శరీరం గడ్డ కట్టింది. దీంతో చివరకు శివాజీ చేతి వేళ్లు తీసేయాల్సి వచ్చింది. అనంతరం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. స్వతహాగానే దేశభక్తితో పాటూ నిజాయితీగా వ్యవహరించే శివజా పాటిల్.. ఉద్యోగ విరమణ అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్నీ ఆశించలేదు. అలాగని ఇంట్లోనే కూర్చోకుండా తన సొంత కాళ్ల మీద నిలబడాలని నిర్ణయించుకున్నాడు. బెల్గాంలోనే ఓ కిరాణా దుకాణం (grocery store) మొదలుపెట్టాడు. ఇప్పటికీ పాతకాలం నాటి స్కూటర్‌పై తానే స్వయంగా వెళ్లి సరుకులు తెచ్చుకుంటాడు.

Viral Video: ఆర్డర్ ఆమెదే.. ఆస్వాదించింది మాత్రం ఇంకొకరు.. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వీడియో తీయకపోయి ఉంటే..!

శివాజీ పాటిల్ అల్లుడు, దేశంలోనే అతి పెద్ద బ్రోకరేజీ సంస్థ జెరోధా (Zerodha Company) సహ వ్యవస్థాపకుడైన నితిన్ కామత్.. ఇటీవల తన మామ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. డబ్బుతో ఎలాంటి ఆనందాన్ని కొనలేమని, తన మామగారి లాగా ఆరోగ్యంగా ఉండటంతో పాటూ మంచి జీవితాన్ని గడపాలనేది తన ఆలోచన అని నితిన్ కామత్ తెలిపాడు. తన మామకు 70 ఏళ్లు ఉన్నా ఇప్పటికీ.. తానే స్వయంగా వెళ్లి సరుకులు తీసుకొస్తుంటాడని చెప్పారు. 2007లో నితిన్ కామత్ జీవితంలో పైకి వచ్చేందుకు కష్టపడుతున్న సమయంలో శివాజీ కుమార్తెను వివాహం చేసుకుంటానని కామత్ అడగడంతో ప్రభుత్వం చేయాలంటూ మామ సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని నితన్ కామత్ గుర్తు చేసుకుంటూ.. అన్ని విషయాల్లో తన మామ తనకు ఆదర్శం అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. శివాజీ పాటిల్ నిజాయితీని మెచ్చకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Aadhaar Card: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. మోదీ, యోగి ఆధార్‌ కార్డుల్నే వాడేశాడు.. వాటిని మార్చాలని ట్రై చేసి..!

Updated Date - 2023-07-26T22:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising