Expiry Date: వామ్మో ఎక్స్పైరీ డేట్ గురించి షాకింగ్ నిజాలు.. షూస్ నుండి బాత్రూమ్ లో వాడే ఆ 4వస్తువుల వరకు.. ఏవేవి ఎన్ని రోజులు వాడొచ్చంటే..
ABN , First Publish Date - 2023-07-23T20:15:16+05:30 IST
ఎన్నో వస్తువులు ఎక్స్ఫైరీ డేట్ చూసుకుని కొంటాం, వాడతాం. కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా నెలల తరబడి, ఏళ్ళ తరబడి వాడే వస్తువులు కొన్ని ఉంటాయి.
సాధారణంగా వంటింట్లో ఉపయోగించే పిండి, నూనె నుండి ప్యాక్డ్ ఫుడ్స్ అయిన పచ్చళ్లు, డ్రింక్స్ ఇలా ఒకటనేమిటి చాలా పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వీటిని గమనించుకునే వాటిని ఉపయోగిస్తుంటారు. ఇక సౌందర్య ఉత్పత్తులు, నూనెలు, ఫేస్ వాష్ లు, సబ్బులు మొదలైనవి ఎక్స్పైరీ డేట్ చూసుకునే వాడతాం. కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా నెలల తరబడి, ఏళ్ళ తరబడి వాడే వస్తువులు కొన్ని ఉంటాయి. వాటిలో షూస్ నుండి దిండు, పరుపు వరకు.. బాత్రూమ్ లో ఉపయోగించే బ్రష్ నుండి ఒళ్ళు రుద్దుకునే లూపా వరకు ప్రతి ఒక్కదానికి ఎక్స్ఫైరీ డేట్ ఉంది. వీటి గురించి తెలుసుకుంటే..
జాగింగ్, రన్నింగ్ కోసం షూస్(Shoes) ఉపయోగించేవారు రోజూ తాము ఎన్నికిలోమీటర్లు పరిగెడుతున్నారనే దాని ఆధారంగా షూస్ ను మార్చాలి. సాధారణంగా 500కిమీ పరుగెత్తిన తరువాత షూస్ అరిగిపోతాయి, అరిపోయాయని కాదు గానీ పాతబడిన షూస్ వాడేకొద్దీ కాళ్ళ చర్మం దెబ్బతినడం మొదలవుతుంది. కాళ్ళ పగుళ్లు, ఫంగస్ కారణంగా పుండ్లు ఏర్పడుతాయి. సాక్స్(socks) అయితే 6నెలల తరువాత కొత్తవి ఉపయోగించాలి.
రోజూ ఉపయోగించే దిండ్లకూ ఎక్స్పైరీ డేట్(pillows expire date) ఉందట. దిండ్లను 2ఏళ్ళకు మించి వాడకూడదు. అలాగే పరుపు కూడా 5ఏళ్లకు మించి వాడకూడదట. పాత దిండ్లు, పరుపులలో బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే పళ్ళు తోముకునే బ్రష్(tooth brush) ను అరిగిపోయే వరకు వాడుతుంటారు. కానీ వీటిని 3నెలలకు మించి ఉపయోగించకూడదు. ఈ సమయం దాటితే అది దంతాలను,చిగుర్లను దెబ్బతీస్తుంది. వీటి బదులు తాజా వేప పుల్ల వాడినా ఎంతో ఆరోగ్యం.
Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. చింపాంజీకి నీళ్ళుతాగడంలో సహాయం చేశాడొక వ్యక్తి.. ఆ చింపాంజీ ఏం చేసిందో చూస్తే..
పదును తగ్గేవరకు రేజర్లను(razor) ఉపయోగించడం చాలా మంది చేసేపని. కానీ 5సార్లకు మించి రేజర్లను ఉపయోగించకూడదు. 5సార్లకు మించి ఉపయోగించే బ్లేడ్ మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. మొద్దుబారేకొద్ది అది సరిగా షేవ్ చేయలేక తెగే అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువుంది.
స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకునే టవల్(towel) ను ప్రతి సంవత్సరం మార్చాలి. సంవత్సరానికి మించి వాడే టవళ్లు అదొక రకమైన వాసన వస్తుంటాయి. పైపెచ్చు ఇంటిల్లిపాదీ ఒకే టవల్ ఉపయోగించేవాళ్ళకు ఇది అంత మంచిది కాదు.
స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకోవడానికి లూఫా(loofah) వాడుతుంటారు. చర్మం మీది మృతకణాలు అన్నీ ఈ లూఫాలో పేరుకుపోయి ఉంటాయి.లూఫాను వేడి నీటితో బాగా శుభ్రం చేసుకునేలా అయితే టూత్ బ్రష్ లాగా రెండు మూడు నెలలు వాడొచ్చు. కానీ శుభ్రత ఫాలో అవ్వకపోతే లూఫాను నెలరోజులు ఉపయోగించడం కూడా సమస్యే..