ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఏడుస్తూ ఇంటికొచ్చిన 7 ఏళ్ల కూతురు.. ఏమైందమ్మా అని ఒడిలో కూర్చోబెట్టుకుని అడిగితే.. ఆ పాప చెప్పింది విన్న తల్లికి..!

ABN, First Publish Date - 2023-10-18T12:34:17+05:30

ఇంట్లో చిన్నారులుంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియజేసే ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌ (Jaipur) లో వెలుగు చూసింది.

Shocking: ఇంట్లో చిన్నారులుంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియజేసే ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌ (Jaipur) లో వెలుగు చూసింది. అందులోనూ ఇళ్లలో ఆడ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. జైపూర్ నగర పరిధిలోని ముహనా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో పొరుగింటిలో ఉండే ఓ వ్యక్తి ఆ చిన్నారికి చాక్లెట్ ఆశచూసి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ మృగాడు చిన్నపిల్ల అని కూడా చూడకుండా పాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నొప్పిగా ఉందని ఏడ్చిన ఆ చిన్నారిని ఈ విషయం ఎవరికైనా చెబితే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించి ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. ఆ తర్వాత తన ఇంటికి తాళం వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

Wife: కట్టుకున్న భార్యను అసభ్యంగా వర్ణిస్తూ ఫ్రెండ్స్‌తో ఓ భర్త చాటింగ్.. సడన్‌గా ఓ రోజు ఆ నీచాన్ని భార్య చూడటంతో..!

ఇక అప్పటివరకు తన కళ్లముందే ఆడుకుంటున్న కూతురు (Daughter) కనిపించకపోవడంతో తల్లి ఇంటి చుట్టుపక్కలంతా వెతికింది. కానీ, ఆమెకు ఆ చిన్నారి ఎక్కడ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చింది. అలా ఏడుస్తూ ఇంటికి వచ్చిన పాపను.. ఏమైందమ్మా అని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా అడిగిందా తల్లి. అప్పుడు ఆ చిన్నారి పక్కింటి అంకుల్ చేసిన పాడుపని గురించి చెప్పింది. నొప్పిగా ఉందమ్మా అంటూ ఆమె ఏడ్వడం చూసి ఆ తల్లి గుండెపగిలిపోయింది. వెంటనే భర్తను తీసుకుని పొరుగింటి వ్యక్తి ఇంటికి వెళ్లింది. కానీ, అప్పటికే ఆ నీచుడు ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో ఆ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధిత బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Viral Video: ఫస్ట్‌టైమ్ భారతీయ వంటకాలను రుచి చూసిన తెల్లోడు.. మైండ్‌బ్లోయింగ్ రియాక్షన్‌తో ఏం చెప్పాడో మీరే చూడండి..!


Updated Date - 2023-10-18T12:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising