ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మహానటి సావిత్రమ్మే మళ్లీ పుట్టిందా ఏంటీ..? గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు.. ఐశ్వర్యారాయ్ డైలాగ్స్‌ను చెబుతూనే..!

ABN, First Publish Date - 2023-07-21T16:28:18+05:30

సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఫేమస్ అయ్యేందుకు యువతీయువకులు వివిధ రకాలుగా ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ప్రాంక్, ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. అలాగే ఇంకొందరు..

సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఫేమస్ అయ్యేందుకు యువతీయువకులు వివిధ రకాలుగా ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ప్రాంక్, ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. అలాగే ఇంకొందరు తమలోని నటనను బయటికి తీస్తూ వివిధ సినిమాల్లోని సన్నివేశాలను తమదైన స్టైల్లో రీషూట్ చేస్తుంటారు. కొందరైతే సన్నివేశంలో ఆ సన్నివేశాల్లో జీవించి మరీ నటిస్తుంటారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలిక వీడియో సోషల్ మీడియలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఐశ్వర్యారాయ్ డైలాగ్స్‌ను చెబుతూ గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు తెప్పించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ వయసులోనే ఈ రేంజ్ పర్ఫామెన్సా..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. షారూఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ నటించిన దేవదాస్ (Shahrukh Khan and Aishwarya Rai Devdas movie) చిత్రంలోని ఓ సన్నివేశంలో ఓ బాలిక అద్భుతంగా నటించింది. ఐశ్వర్యారాయ్ చెప్పిన డైలాగ్స్‌ను చెబుతూ సన్నివేశానికి తగ్గట్టు మధ్యలో కన్నీళ్లు పెడుతుంది. సాధారణంగా ఇలాంటి సన్నివేశంలో ఎవరైనా కన్నీళ్లు వచ్చేందుకు గ్లిజరిన్ వేసుకుంటారనే విషయం తెలిసిందే. కానీ ఈ బాలిక (girl) మాత్రం ఎలాంటి గ్లిజరిన్ (glycerin) వేసుకోకుండా.. అద్భుతంగా నటించడంతో పాటూ కన్నీళ్లు తెప్పించింది.

Viral: అమ్మ బాబోయ్.. ఇదేం మాయ.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులు ఎటు వైపు నడుస్తున్నారో చెప్పగలరా..?

బాలిక నటన చూస్తే.. సినిమాలో కూడా ఈమే నటించిందేమో అన్నట్లుగా ఉంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈమె నటన అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘మహానటి సావిత్రమ్మే మళ్లీ పుట్టిందా ఏంటీ’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఈ పాపకు మంచి భవిష్యత్ ఉంటుంది’’.. మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 66వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తిమింగళం మీదకు దూకేసిన వ్యక్తి.. తప్పించుకోవడం ఇక అసాధ్యం అనుకుంటే.. చివరకు ఛత్రపతిని మించిపోయాడుగా..

Updated Date - 2023-07-21T16:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising