Spy Apps: గూగుల్ డిలీట్ చేసిన 17 యాప్స్ లిస్ట్ ఇదీ.. మీ ఫోన్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలీట్ చేసేయండి..!
ABN, First Publish Date - 2023-12-08T18:34:01+05:30
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎంతో మంది సులభంగా డబ్బులు సంపాదిస్తుంటే.. మరోవైపు అంతే స్థాయిలో తీవ్రంగా నష్టపోతున్నారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని...
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎంతో మంది సులభంగా డబ్బులు సంపాదిస్తుంటే.. మరోవైపు అంతే స్థాయిలో తీవ్రంగా నష్టపోతున్నారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ కూడా అనేక రక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా 17 యాప్‌లను డిలీట్ చేసింది. ఎవరి ఫోన్లలో అయినా సంబంధిత యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది. ఇంతకీ ఆ యాప్‌లు ఏంటో తెలుసుకుందాం..
వివిధ అవసరాల నిమిత్తం చాలా మంది వివిధ రకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. అయితే వీటిలో కొన్ని యాప్‌లు మోసపూరితమైనవని గ్రహించలేరు. అందుకే వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని Google ఎప్పటకప్పుడు ఇలాంటి వాటిపై మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా కొన్ని యాప్‌ల (apps) ద్వారా వినియోగదారుల డాటా (Consumer data) మొత్తం చోరీకి గురవుతున్నట్లు గుర్తించింది. ESET సాఫ్ట్‌వేర్ కంపెనీ మొత్తం 17 యాప్‌లను తొలగించింది. వీటిలో లోన్లు ఇచ్చే యాప్‌లు ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారుల డాటా చోరీ చేయడం ద్వారా.. చివరకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుందని సందరు కంపెనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Google తొలగించిన యాప్‌ల వివరాలు వరుసగా ఇలా ఉన్నాయి. ‘‘AA క్రెడిట్, అమోర్ క్యాష్, GuayabaCash, EasyCredit, Cashwow, CrediBus, FlashLoan, PréstamosCrédito, Prestamos De Crédito-YumiCash, Go Crétamoto, Go Crétamoto Cartera grande, Finupp Lending, 4S Cash, TrueNaira, EasyCash’’
మీ స్మార్ట్ ఫోన్‌లో పైన తెలిపిన యాప్‌లు ఉంటే వెంటనే తొలగించాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భారతీయులకు చెందిన మొబైల్స్‌లో ఈ యాప్‌లు ఎన్ని ఉన్నాయనే విషయంపై ESET సంస్థ ఎలాంటి వివరాలూ వెళ్లడించలేదు. అయినా మీ ఫోన్లలో ఈ పేర్లతో ఎలాంటి యాప్‌లు ఉన్నా తొలగించడం ఉత్తమం.
Updated Date - 2023-12-08T18:34:04+05:30 IST