ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Google-Police: దగ్గర్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా..? అని గూగుల్‌లో వెతికితే షాకింగ్ రిజల్ట్..!

ABN, First Publish Date - 2023-11-15T20:33:54+05:30

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా.. ఫోన్‌లో ఇలా ప్రెస్ చేస్తే.. అలా మన అర చేతిలోకి వచ్చి పడుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లే సమయంలోనూ గూగుల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. మనకు దగ్గరలో...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా.. ఫోన్‌లో ఇలా ప్రెస్ చేస్తే.. అలా మన అర చేతిలోకి వచ్చి పడుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లే సమయంలోనూ గూగుల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. మనకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, హోటళ్లు తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. దగ్గరల్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా..? అని గూగుల్‪లో వెతికితే షాకింగ్ రిజల్ట్ వచ్చింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు (Delhi Police) వ్యవస్థ ఎంత పటిష్టవంతంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్న ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పోలీసులు ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ గూగుల్ ల్యాండ్ మార్క్ (Google Land Mark) ఉండడాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. దగ్గర్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా..? అని టైప్ చేయగా.. ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారనే వివరాలు మొత్తం ప్రాంతాల వారీగా వచ్చేశాయి. ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: వారెవ్వా.. ఏం తెలివి బాసూ.. కారు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ వ్యక్తి టెక్నిక్‌ను చూడాల్సిందే..!

అత్యవసర సమయాల్లో పోలీసులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టుపై తాజాగా ఢిల్లీ పోలీసులు స్పందించారు. సదరు ఫొటోను వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘మా ఉనికిని గుర్తించినందుకు ధన్యావాదాలు.. పోలీసుల సాయం కోసం 112 నంబర్‌లో సంప్రదించాలని, అలాగే నేరుగా ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయొచ్చు’’.. అని పేర్కొన్నారు. కాగా, దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు చాలా యాక్టివ్‌గా ఉన్నారు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సౌలభ్యంతో నేరస్థులు తప్పించుకునే అవకాశం ఉంటుంది’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వార్త ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఈ ఒక్క ఫొటో.. ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోందిగా.. బైక్ వెనుక కూర్చున్న ఈ కుర్రాడు పేపర్ హెల్మెట్‌ను పెట్టుకోవడంతో..!

Updated Date - 2023-11-15T20:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising