ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బొట్లు పెట్టి.. దండలు వేసి మరీ ఈ ఏనుగుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు సన్మానం చేస్తున్నారంటే..!

ABN, First Publish Date - 2023-10-06T17:00:35+05:30

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా...

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఏనుగుకు బొట్లు పెట్టి, దండలు వేసి మరీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఇంతకీ ఈ ఏనుగు ఎందుకు సన్మానం చేశారంటే..

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) కార్బెట్ టైగర్ రిజర్వ్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పార్క్‌లో గోమతి అనే ఏనుగు (elephant) 47 ఏళ్లుగా టైగర్ రిజర్వ్ పార్క్‌కు తన వంతు సేవలందించింది. ప్రస్తుతం ఈ ఏనుగు 66 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అధికారులు ఈ ఏనుగుకు రిటైర్డ్ ఫంక్షన్ (Retired function) నిర్వహించారు. అమదంట గేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగుకు దండలు వేసి సన్మానం చేశారు. అలాగే ఇన్నేళ్ల పాటు ఏనుగు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Viral Video: కొంపముంచిన ఇన్‌స్టా రీల్.. ఖరీదైన హోటల్లో బెడ్‌పై నోట్ల కట్టలతో వీడియో చేసిన బాలుడు.. చివరకు..

నాలుగు దశాబ్ధాల క్రితం అస్సాం నుంచి పార్కులో చేరి గోమతి ఏనుగు అనేక రెస్య్కూ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ వీడియోను షేర్ చేసిన IFS అధికారి ధీరజ్ పాండే .. ఏనుగు సేవలను గుర్తు చేసుకున్నారు. 47ఏళ్లలో గోమతి ఎన్నో సేవలందించిందని చెప్పారు. జంగిల్ పెట్రోలింగ్, సాహసోపేతమైన రెస్క్యూలు తగితర కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగును సన్మానించడం అభినందనీయం’’.. అని మరికొందరు, ‘‘ఈ ఏనుగుకు సెల్యూట్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అక్టోబర్ 4న షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 13వేలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.

Anand Mahindra: టీమ్ ఇండియా జెర్సీ ఓకే కానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్..!

Updated Date - 2023-10-06T17:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising