Hair Fall: ఈ 5 అలవాట్లను వదిలేయండి చాలు.. జుట్టు రాలడం దానంతట అదే ఆగిపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-06-12T15:24:49+05:30 IST

'నాకు చిన్నప్పుడు ఎంత పెద్ద జుట్టు ఉండేదో ఇప్పుడు ఇలా అయిపోయింది' అని కనీసం ఒక్కసారి అయినా అనుకోని అమ్మాయిలు ఉండకపోవచ్చు. రోజువారి జీవితంలో ఈ 5అలవాట్లే జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి.

Hair Fall: ఈ 5 అలవాట్లను వదిలేయండి చాలు.. జుట్టు రాలడం దానంతట అదే ఆగిపోవడం ఖాయం..!

ప్రస్తుతకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్. మరీ ముఖ్యంగా ఈ సమస్య అంతా యువతలోనే ఎగక్కువగా ఉంటోంది. 'నాకు చిన్నప్పుడు ఎంత పెద్ద జుట్టు ఉండేదో ఇప్పుడు ఇలా అయిపోయింది' అని కనీసం ఒక్కసారి అయినా అనుకోని అమ్మాయిలు ఉండకపోవచ్చు. మారుతున్న జీవనశైలి జుట్టు రాలడానికి కారణమవుతుందని అందరూ అంటారు. కానీ, రోజువారి జీవితంలో ఈ 5అలవాట్లే జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. వీటిని మానేస్తే జుట్టురాలడం అనే సమస్య ఉండనే ఉండదు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో.. వాటి వల్ల జుట్టు ఎలా ప్రభావమవుతోందో పూర్తీగా తెలుసుకుంటే..

చాలామందికి జడ వదులుగా వేసుకుంటే అస్సలు నచ్చదు. చాలా బిగుతుగా వేసుకుంటుంటారు(hair tie tight). కనీసం పోని టైల్ వేసుకున్నా అంతే బిగుతుగా వేసేస్తారు. ఇలా వేయడం వల్ల జుట్టు మూలాలు బలహీన పడతాయి. జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. దీనికారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు విరిగిపోకుండా ఉండాలంటే గట్టిగా అల్లే పద్దతి మానుకోవాలి.

ఇప్పటి కాలంలో అమ్మాయిలు తల స్నానం తరువాత జుట్టు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించే హెయిర్ డ్రైయర్(hair dryer), హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఉపయోగించే హెయిర్ స్ట్రైయిటనర్(hair strightener) అన్నీ జుట్టుకు నష్టం కలిగించేవే. వీటి కారణంగా జుట్టు బలహీనపడి, పొడిబారుతుంది. అప్పుడప్పుడు వీటిని వాడితే పర్లేదు కానీ రోజూ వాడితే హెయిర్ డ్యామేజ్ తప్పదు.

Viral Video: జింక ఏదో తింటోంటే సరదాగా వీడియో తీసిన ఫోటోగ్రాఫర్.. డౌటొచ్చి జూమ్ చేసి చూస్తే ఊహించని షాక్.. అసలు విషయం మీరే చూడండి..


హెయిర స్టైల్ చేసుకోవడానికి ఉపయోగించే వస్తువుల కారణంగా జుట్టు మీద మురికి ఏర్పడుతుంది. సాధారణంగా షాంపూ చేసుకోవడం ద్వారా ఈ మురికిని వదిలించుకోలేము. దీనికోసం పెరుగు, కాఫీ వంటి పదార్థాలు బాగా ఉపయోగపడతాయి(curd, coffee for cleaning hair). వీటితో జుట్టు శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టుకు జీవం వస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు మెరుస్తుంది కూడా.

చాలామంది అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తలస్నానం(head bath) చెయ్యడం తప్పనిసరి. అయితే బయటకు వెళ్ళడానికి ఆలస్యమవుతుందనే కారణంతో జుట్టు ఇంకా తడిగా ఉన్నట్టే దాన్ని దువ్వడం(wet hair combing), గట్టిగా లాగడం చేస్తుంటారు. ఈ పని చేయడం వల్ల జుట్టు చాలా తొందరగా విరిగిపోయి రాలిపోతుంది.

ప్రతి ఒక్కరూ జుట్టు కాపాడుకోవడానికి షాంపూలు, హెయిర్ ప్యాక్ లు, కండీషనర్లు, టోనర్లు అంటూ బోలెడు వాడతారు. అయితే జుట్టుకు బయటినుండి పోషణ అందివ్వడం కంటే లోపలినుండి పోషణ అందివ్వడం ఉత్తమమైన మార్గం. ఇందుకోసం పోషకాహారం సమృద్దిగా తీసుకోవాలి.

Viral News: అదృష్టమంటే ఈ పిల్లాడిదే.. 14ఏళ్ళకే ఉద్యోగం.. ఎందులోనో తెలిస్తే షాకవుతారు.


Updated Date - 2023-06-12T15:24:49+05:30 IST