Health: సడన్‌గా బరువు తగ్గిపోవడం.. తరచూ కడుపునొప్పి.. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే అది మామూలు సమస్య కాదు..!
ABN , First Publish Date - 2023-05-05T10:23:20+05:30 IST
. 'హా.. ఏముంది బరువు తగ్గితే మంచిదేలే' అనే అభిప్రాయంతోనో.. 'కడుపునొప్పే కదా తగ్గిపోతుందిలే' అనే నిర్లక్ష్యంతోనో ఉంటున్నారా??
ఓ మహిళ తరచూ కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది, దానికి తగ్గట్టు ఆమె 45రోజులలో సుమారు 12కిలోల బరువు తగ్గింది. ఏమవుతుందిలే అని మొదట్లో నిర్లక్ష్యం చేసింది కానీ మూత్రం, మలం ముదురు రంగులో పాలిపోయినట్టు కనిపించేసరికి ఆమెకెందుకో అది సాధారణ సమస్య కాదని అనిపించింది. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని చివరికి వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఆమెను పరీక్షించి దిగ్బ్రాంతి కలిగించే విషయం చెప్పారు. 'హా.. ఏముంది బరువు తగ్గితే మంచిదేలే' అనే అభిప్రాయంతోనో.. 'కడుపునొప్పే కదా తగ్గిపోతుందిలే' అనే నిర్లక్ష్యంతోనో ఉండటం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకోవడమేనట. ఇంతకూ ఈ రెండు సమస్యలూ ఓ మహిళకు కలిగించిన పెనుముప్పు గురించి పూర్తీగా తెలుసుకుంటే..
కడుపునొప్పి(stomach ache) అందరిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. సరిగా ఉడకని ఆహారం తీసుకున్ననప్పుడు(undercooked food).. అతిగా తిన్నప్పుడో(eating too much).. వేడి చేసినప్పుడు(increase body heat).. ఆకలి అయినప్పుడు(hungry) ఇలా చాలా సందర్భాలలో కడుపునొప్పి అనుభవిస్తూంటారు. అయితే అప్పుడప్పుడు ఇలా కడుపునొప్పి రావడంతో పాటు, సడన్ గా బరువు తగ్గుతుంటే(unexpected weight loss) మాత్రం దాన్ని సాధారణ సమస్యగా కొట్టిపడేయడాని లేదండోయ్. ఓ మహిళ కడుపునొప్పి, బరువు తగ్గడమనే సమస్యలతో వైద్యుడిని సంప్రదించగా ఆమెకు కాలేయ క్యాన్సర్(liver cancer) ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. పరీక్షలలో ఆమెకు అసిటిస్(ascites) ఉన్నట్టు వెల్లడైంది. దీని కారణంగా పొత్తి కడుపులో ద్రవాలు(fluids in abdominal) ఏర్పడతాయి, ఈ కారణంగా పొత్తికడుపు వాపు, నొప్పి(Abdominal swelling, pain) ఉంటుంది. అంతేకాకుండా ఆమెలో బిలిరుబిన్(bilirubin) స్థాయిలు పెరిగినట్టు వైద్యులు నిర్థారించారు. దీనివల్ల హిమోగ్లోబిన్ విచ్చిన్నం(hemoglobin damage) అవుతుంది. ఇవి మరింత పెరిగితే కామెర్లు(jaundice), కళ్లు పసుపురంగులోకి లేదా తెలుపురంగులోకి(eyes turn to yellow or white) మారతాయి. కాలేయంలో కణితి కూడా ఏర్పడుతుంది. ఇదే కాలేయ క్యాన్సర్ ను ప్రభావం చేసి ప్రాణాలమీదకు తెస్తుంది.
Viral Video: ఆటో ఆగకుండానే.. యమా స్పీడ్‌గా వెళ్తూనే పంక్చర్ అయిన టైర్‌ను మార్చేసిన డ్రైవర్.. చూస్తే అవాక్కవడం ఖాయం..!
కాలేయ క్యాన్సర్ ను ముందుగా గుర్తించాలంటే..
మూత్రం సాధారణంగా కాకుండా ముదురు రంగులో ఉంటుంది. ఆకలి లేకపోవడం, అలసటగా అనిపించడం, జ్వరంగా ఉండటం జరుగుతుంది. మలం పాలిపోయన రంగులో ఉంటుంది. వీటన్నింటిని చాలా సహజమైన సమస్యలుగా కొట్టిపారేస్తుంటారు అందరూ. ఇవి కాకుండా పొట్ట ఉబ్బడం(stomach bloating), పొత్తి కడుపు కుడివైపున నొప్పి(Abdominal pain), కుడి భుజంలో నొప్పి(right shoulder pain) ఉంటాయి. కడుపునొప్పితో పాటు ఈ లక్షణాల్లో ఏవైనా మీకూ ఉన్నట్టు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అన్నివిధాలా శ్రేయస్కరం.