ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: అన్నం తింటూ సులువుగా బరువు తగ్గచ్చా? ఈ బియ్యంతో అన్నం వండుకుని తింటే..

ABN, First Publish Date - 2023-08-31T16:26:41+05:30

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలంటారు, కానీ ఈ బియ్యంతో అన్నం వండుకుని తింటే..

అధికబరువు చాలామందిని వేధిస్తున్న సమస్య. ఈ అధిక బరువు వదిలించుకోవడానికి జిమ్ లో చాలా కష్టపడుతుంటారు. ఇక ఆహారం విషయానికి వస్తే అన్నం తింటే బరువు పెరుగుతారని, అందుకే బరువు తగ్గాలంటే అన్నం వదిలెయ్యాలని అంటుంటారు. కానీ పూర్తీగా అన్నం తినకుండా ఉండటం కష్టం. డైటింగ్ అని చెప్పుకుంటూ అప్పుడప్పుడు బిర్యానీలు, భోజనం లాగిస్తుంటారు. దీనివల్ల ఇతరులకు వచ్చే నష్టమేమీ ఉండదు. నష్టమంతా బరువు ఉన్నవారికే. అయితే అన్నం తింటూ బరువు తగ్గాలంటే సాధారణ బియ్యాన్ని వాడకూడదు. దీనికి బదులు బ్లాక్ రైస్ వాడితే బరువు తగ్గడంతో పాటు అన్నం తిన్నామనే తృప్తి కూడా లభిస్తుంది. సాధారణ బియ్యంలాగే నల్లగా ఉండే ఈ బ్లాక్ రైస్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎలా తోడ్పడతాయో? ఈ బియ్యం వినియోగించడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

బ్లాక్ రైస్‌(Black rice)లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బోలెడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ తో అన్నం వండుకుని తినడం వల్ల గుండె జబ్బులు(heart problems), కీళ్లనొప్పులు(joint pains), అల్జీమర్స్(Alzheimer's) మొదలైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది(increase immunity power). జీర్ణక్రియకు ఈ బ్లాక్ రైస్ ఎంతగానో సహాయపడుతుంది. మెరుగైన జీవక్రియ ఉన్నవారిలో అధికబరువు అనే సమస్య ఎదురవ్వదు. బ్లాక్ రైస్ తింటే క్రమంగా బరువు తగ్గడమే(weight loss) కాదు ఆ తరువాత బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.

Viral Video: ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..



బ్లాక్ రైస్ ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది(control cholesterol). ఆ తరువాత ఆహారంలో కొవ్వులు ఉన్నా అది ధమనులలో కొవ్వు పేరుకోకుండా నియంత్రిస్తుంది. ఈ కారణంగా ఇది గుండె జబ్బుల ప్రమాధాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా బ్లాక్ రైస్ లో ఆంథోసైనిస్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. పైపెచ్చు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అల్జీమర్స్ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తుంది.

బ్లాక్ రైస్‌లో ఉండే ఆంథోసైనిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఈ ఆంథోసైనిన్ ఇన్సులిన్ తయారీలో కూడా సహాయపడుతుంది. ఈ కారణంగా మధుమేహం ఉన్నవారు బ్లాక్ రైస్ వాడటం వల్ల మధుమేహ సమస్యను నియంత్రించుకోవచ్చు(control diabetes).

Viral Video: ఇలాంటి వెర్రి వేషాలే వద్దనేది.. పుట్టినరోజు సంబరంలో ఓ యువతి ఏకంగా అపార్టమ్మెంట్ కిటికి ఎక్కి మరీ డాన్స్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..


Updated Date - 2023-08-31T16:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising