అదొక అత్యంత విచిత్రమైన తెగ.. స్నానం చేయని అక్కడి మహిళలు... తమ ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారంటే...
ABN , First Publish Date - 2023-04-18T11:10:47+05:30 IST
ఆఫ్రికన్ దేశమైన నమీబియా(Namibia)లోని కునేన్ ప్రావిన్స్‌లో హింబా అనే ఒక తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన భూములు కలిగిన...
ఆఫ్రికన్ దేశమైన నమీబియా(Namibia)లోని కునేన్ ప్రావిన్స్‌లో హింబా అనే ఒక తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన భూములు కలిగిన ప్రాంతాలలో ఒకటి. హింబా తెగ ప్రజల సంప్రదాయాలు(Traditions) అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.
హింబా తెగకు చెందిన యువతులు ఒక రోజు మాత్రమే స్నానం చేస్తారు. అది కూడా వారి పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని నీటి కొరత కారణంగా పరిమిత స్నానం(bath) అనేది వారి ఆచారంలో భాగంగా మారిపోయింది. వారు స్నానం చేయకపోయినప్పటికీ వారి శరీరం దుర్వాసన రాకపోవడం విశేషం. ఇక్కడి మహిళలు ఒక ప్రత్యేకమైన పేస్ట్(Paste)ను శరీరానికి రాసుకుంటారు.
ఇది వారి శరీర దుర్వానను పోగొట్టడమే కాకుండా పలు విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేకమైన పూత సూర్యరశ్మి(sunshine) నుండి వారి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే క్రిమి కీటకాలు, పురుగుల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ పేస్ట్ మహిళల ముఖాన్ని కాంతివంతం(light) చేస్తుంది. హింబా తెగ ప్రజలు తమ ఇంటికి పురుష అతిథులు వచ్చినప్పుడు తమ భార్యలను వారి దగ్గరకు శృంగారంలో పాల్గొనడానికి పంపిస్తారు.
ఈ సమయంలో ఆ ఇంటిలోని వారు వేరే గదిలో లేదా ఇంటి బయట పడుకుంటాడు. హింబా తెగ(Himba tribe)లోని పురుషులు, మహిళలు తమ జాతిలోని పలువురితో లైంగిక సంబంధాలను కలిగివుంటారు. హింబా తెగకు చెందిన మహిళలు ఆఫ్రికాలో అత్యంత అందమైనవారిగా(beautiful) గుర్తింపుపొందారు. నమీబియాలో హింబా తెగ ప్రజల జనాభా దాదాపు 50 వేలు. వారి సంప్రదాయాలు, జీవనశైలికి(lifestyle) సంబంధించిన అనేక పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయి.