ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AC: ఏసీ తెచ్చిన తంటా.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రపోతోంటే అర్ధరాత్రి దాటిన తర్వాత సడన్‌గా..!

ABN, First Publish Date - 2023-08-05T16:21:15+05:30

ప్రస్తుతం చాలా ఇళ్లలో కూలర్లు, ఏసీలూ కామన్ అయిపోయాయి. వీటి వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వాటి వినియోగంపై ఏమాత్రం అవగాహన లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా...

ప్రస్తుతం చాలా ఇళ్లలో కూలర్లు, ఏసీలూ కామన్ అయిపోయాయి. వీటి వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వాటి వినియోగంపై ఏమాత్రం అవగాహన లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి సడన్‌గా ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్ పరిధి నవ్ ఆదర్శ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాల్ జైస్వాల్ అనే వ్యక్తి స్థానికంగా భార్యా పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. విశాల్ స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలో పని చేస్తుంటాడు. అయితే శుక్రవారం రాత్రి వీరి ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ధబేల్‌మని పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో విశాల్ ఉలిక్కిపడి లేచి చూడగా.. అప్పటికే ఇళ్లంతా మంటలు (fire accident) వ్యాపించాయి. దీంతో కంగారు భార్యా, పిల్లలతో సహా బయటకు పరుగులు తీశాడు. చూస్తుండగానే ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

పేలుడు శబ్ధానికి చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. మంటలు ఆర్పాలని ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. చివరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు వాహనాల్లో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ (Short circuit in AC) కారణంగానే మంటలు వ్యాపించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Wife: అందం కోసం భర్త సంపాదనను కరిగించేస్తున్న భార్య.. అంతా పతి కోసమేనంటూ ప్లాస్టిక్ సర్జరీలకై కోట్లలో ఖర్చు..!

Updated Date - 2023-08-05T16:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising