Viral Video: కుక్కలు మొరుగుతుండడంతో కిటీకీలోంచి బయటికి చూసిన వ్యక్తి.. సడన్‍గా ఇంటి ముందుకు మొసలి రావడం చూసి..
ABN, First Publish Date - 2023-10-10T18:51:44+05:30
అటవీ ప్రాంతాల సమీపంలో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. విష సర్పాలు, క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. సాధారణంగా పాములు, కొండచిలువలు, పులులు, సింహాలు జనావాసాల్లోకి రావడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే..
అటవీ ప్రాంతాల సమీపంలో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. విష సర్పాలు, క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. సాధారణంగా పాములు, కొండచిలువలు, పులులు, సింహాలు జనావాసాల్లోకి రావడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఊహకందని విధంగా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇళ్ల పరిసరాల్లోకి ప్రవేశించిన మొసలి వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇంటి ముందుకు వచ్చిన భారీ మొసలి.. చివరకు అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) తూర్పు బుర్ద్వాన్‌లోని కల్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్నా ప్రాంతంలోకి సోమవారం రాత్రి ఓ భారీ మొసలి ప్రవేశించింది. రాత్రంతా వీధుల్లో సంచరిస్తూ ఉంది. దాన్ని చూసిన కుక్కలు మొరగడం మొదలెట్టాయి. అయినా చాలా మందికి ఎలాంటి అనుమానం రాలేదు. మంగళవారం ఉదయం ఆ మొసలి (crocodile came in front of house) ఓ ఇంటి ముందుకు వచ్చింది. అప్పటికే కుక్కలు మొరుగుతుండడంతో ఇంట్లోని వ్యక్తి కిటికీ నుంచి బయటికి చూశాడు. అప్పటికే ఇంటి ముందుకు వచ్చిన సుమారు 10 అడుగుల భారీ మొసలిని చూసి గజగజా వణికిపోయాడు.
విషయం తెలియడంతో చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. అంతా చూస్తుండగానే మొసలి అటూ ఇటూ తిరుగుతూ చివరకు ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లింది. మొసలిని చూసి ఎవరూ కనీసం దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయలేదు. ఇంట్లోని వారంతా తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. చివరకు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొసలి స్థానికంగా ఉన్న భాగీరథి నది నుంచి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-10-10T18:51:44+05:30 IST