Two Wives Fight: ఇద్దరు భార్యల మధ్య రాజుకున్న గొడవ కాల్పులకు దారితీసింది...చివరికి భర్తకు ఏమైందంటే...
ABN, First Publish Date - 2023-02-20T09:16:05+05:30
ఇద్దరు భార్యలుంటే వారి మధ్య వివాదం రాజుకుంటుందనే విషయం మరోసారి బయటపడింది....
భోపాల్ (మధ్యప్రదేశ్): ఇద్దరు భార్యలుంటే వారి మధ్య వివాదం రాజుకుంటుందనే విషయం మరోసారి బయటపడింది. ఇద్దరు భార్యల మధ్య జరిగిన గొడవలో భర్త తుపాకీ తూటా గాయంతో మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం వెలుగుచూసింది.(Husband Shot) భోపాల్(Bhopal) నగరానికి చెందిన తాహెర్ ఖాన్కు ఇద్దరు భార్యలు.తాహెర్ ఖాన్ మొదటి భార్య అంజుమ్ ఆమె కుమారుడు, మరికొంతమందితో కలిసి రెండవ భార్య హుమాఖాన్ తో వాగ్వాదానికి దిగిన ఘటనలో కాల్పులు జరిగాయి.(During Fight Between 2 Wives)
ఇది కూడా చదవండి : Asaduddin Owaisi : ఢిల్లీలో ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి...పగిలిన కిటికీలు
తాహెర్ ఖాన్, మొదటి భార్య అంజుమ్ విడాకుల కేసు కోర్టులో పెండింగులో ఉంది.భర్త తాహెర్ ఆస్తిలో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని మొదటి భార్య కోర్టులో కేసు వేసింది. తాహెర్ ఖాన్ తన మొదటి భార్య అంజుమ్ తో గొడవ పడ్డాడు. మొదటి భార్య అంజుమ్ ముగ్గురు వ్యక్తులతో భర్త తాహెర్ ఇంటికి వచ్చి అతని రెండవ భార్య హుమా ఖాన్ తో గొడవపడ్డాడు. గొడవ విని బాత్రూంలో ఉన్న భర్త తాహెర్ ఖాన్ బయటకు వచ్చాడు. అంతలో మొదటి భార్యతో వచ్చిన వారు కాల్పులు జరపడంతో తాహెర్ మరణించాడు.
ఇది కూడా చదవండి : North Korea: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం...కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక
ఈ కాల్పుల్లో రెండో భార్య హుమాఖాన్ తీవ్రంగా గాయపడి హమీదియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు భార్యల నడుమ ఏర్పడిన ఆస్తి పంపకాల వివాదం కాస్తా కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో భర్త మరణించాడు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భోపాల్ పోలీసులు చెప్పారు.
Updated Date - 2023-02-20T09:16:07+05:30 IST